Pawan Kalyan And Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మాములుగా లేదు. వైసీపీ వర్సెస్ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొద్ది రోజులుగా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ సమయంలో వారు కూడా పవన్ కళ్యాణ్‌పై విరచుకు పడ్డారు. అయితే జనసేన వర్సెస్ వైసీపీగా మారిన నేపథ్యంలో జగన్, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏఏ సందర్భాలలో ఎవరు ఎలా ప్రవర్తించారు, ఎవరి మంచితనం ఏంటి,ఎవరి దుర్భుద్ది ఏంటనేది నెటిజన్స్ లెక్కలేస్తున్నారు.
అయితే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ బహిరంగ సభలో అంబులెన్స్ వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే కనిపించాడు. ఎలాగు ప్రభుత్వ అంబులెన్స్ లు కనిపించడంలేదు. కనీసం ప్రైవేట్ అంబులెన్స్ కి అయిన దారి ఇవ్వండని అన్నారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఆ సమయంలో ఓ అంబులెన్స్ రాగా, ఆయన కొద్ది సేపు మౌనం వహించారు. ఎంతకు కదలకపోవడంతో అందులో పేషెంట్ నిజంగానే ఉన్నారా అని అడిగారు. అంటే తన మీటింగ్ ని డిస్ట్రబ్ చేయడానికి జగన్ ప్రభుత్వం ఇలాంటి చెత్త ప్లాన్స్ వేసిందా అన్నట్టు పవన్ కళ్యాణ్ అన్నారు.
![Pawan Kalyan And Jagan : బహిరంగ సభలలో అంబులెన్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, జగన్ ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి..! Pawan Kalyan And Jagan how they reacted when ambulance came](http://3.0.182.119/wp-content/uploads/2023/07/pawan-kalyan-1.jpg)
ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి వైసీపీని ఒక్క సీటు గెలవనీయకూడదని అన్నారు. తనకు ప్రయాణం తప్ప గెలుపోటములుండవని వ్యాఖ్యానించారు. జగన్ గంజాయిని రాష్ట్ర పంటగా చేశారని… గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా చేసిండని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను జగన్ నాశనం చేశారన్నారు. జగన్ తన చిన్న వయసులో పోలీసులను కొట్టారని ఆరోపించారు. పోలీసులను కొట్టిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం సిగ్గుచేటు అని విమర్శించారు. పదే పదే తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు ప్రతి చిన్న విషయం కూడా తెలుసని.. మంత్రులందరి చిట్టా తాను విప్పగలనని హెచ్చరించారు. కానీ తన సంస్కారం మాట్లాడనివ్వడం లేదన్నారు.