Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. మా లెక్కలు మాకున్నాయంటూ రానున్న ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి చాలా వీక్‌గా ఉండడంతో ఆ పార్టీ జనసేనపై ఆధారపడింది.ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అసలే ఎన్నికల వేళ అనూహ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్లడం, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు లీడ్ తీసుకుంటుండటం, చివరిగా పవన్ టీడీపీతో పొత్తుల ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలపై చర్చలకు కారణమవుతున్నాయి. ఇన్నాళ్లూ పవన్ చంద్రబాబుకు రహస్య మిత్రుడిగా విమర్శలు చేసిన వైసీపీకి ఇప్పుడు వీరిద్దరి పొత్తుతో ఆ అవకాశం పోయింది.
గతంలో చంద్రబాబు, బీజేపీతో పొత్తు పెట్టుకుని, 2019 ఎన్నికల నాటికి వీరిద్దరికీ వరుసగా గుడ్ బై చెప్పేసి అనంతరం ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్.. అప్పట్లో టీడీపీకి గుడ్ బై చెప్పే సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ విషయంలోనూ చేశారు. టీడీపీ వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి సిద్ధంగా లేనన్న పవన్.. బీజేపీ ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించారు. దీంతో ఈ రెండు వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అవే తిరిగి తెరపైకి వస్తున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు ఉండబోదని ఎవరూ అనుకోకపోయినా ఇంత హఠాత్తుగా ఇలా ప్రకటన వస్తుందని మాత్రం ఊహించలేదు. తద్వారా చంద్రబాబు అరెస్టు కంటే టీడీపీ-జనసేన పొత్తుపైకి చర్చ మళ్లింది.

పవన్ వెన్నుపోటు డైలాగ్ ను తెరపైకి తెస్తోంది. చంద్రబాబును నమ్ముకుంటే ఏదో ఒక రోజు వెన్నుపోటు తప్పదనే అంశాన్ని వైసీపీ వైరల్ చేస్తోంది. అయితే దీనికి కౌంటర్ గా చంద్రబాబుతో పొత్తు వల్ల తమ నేత పవన్ సీఎం అయ్యే అవకాశముందన్న విషయాన్ని జనసేన తెరపైకి తెస్తోంది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబుకి పవన్ వెన్నుపోటు పొడుస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉన్న జనసేనాని తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరితే మా పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు లోలోపల మదనపడుతున్నారు. ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి.