Pawan Kalyan : ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇక మీరు మారరా అంటూ ఫైర్..

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్ గ‌త కొద్ది రోజులుగా వైసీపీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌తో పాటు ఏపీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై జ‌నసేనాని గట్టిగా త‌న వాద‌న వినిపించారు. అయితే తాజాగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం విషయంలో సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్కరంటే ఒక్క టీచర్ నూ రిక్రూట్ చేయలేదని మండిప‌డ్డారు. కానీ తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.

బైజూస్‌కు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా ? ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి ? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు ? ఈ వివరాలన్నీ పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వీటిపై వైసీపీ గవర్నమెంట్ స్పందించాలన్నారు. ఈ ట్వీట్ కింద ట్యాబ్స్ పంపిణీ మంచిదేనని, కానీ ముందు పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించాలన్నారు. అలాగే యాప్స్ ఛాయిస్ అని కానీ టీచర్లు తప్పనిసరి అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు పలు మీడియా క్లిప్స్ ను కూడా జత చేశారు.

Pawan Kalyan again angry comments on cm ys jagan
Pawan Kalyan

వీటిలో స్టార్టప్ కంపెనీ బైజూస్ 2021లోనే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 17 రెట్లు నష్టాలు చవి చూసిందనే కథనం ఉంది. అలాగే బైజూస్ కు ట్యాబ్ ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ ఎంత చెల్లించిందనే వివరాలు కూడా ఉన్నాయి . కరోనా సమయంలో బైజూస్ ఆన్ లైన్ క్లాసులకు విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అయితే సరైన క్వాలిటీ లేని ఆన్ లైన్ చదువులు.. స్కూళ్ల ప్రారంభం తర్వాత బైజూస్ పై అంతా పూర్తిగా నమ్మకం పోగొట్టుకున్నారు. దీంతో శరవేగంగా ఆ సంస్థ కూలిపోతోంది. బైజూస్ కంటెంట్ పై ఏ మత్రం సానుకూల ఫీడ్ బ్యాక్ లేకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీతో కనీసం రూ. ఏడు వందల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago