Patnam Mahender Reddy : కాంగ్రెస్ గూటికి చేరిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఆయ‌న‌ భార్య‌.. ఖాళీ అవుతున్న బీఆర్ఎస్..?

Patnam Mahender Reddy : తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక అనేక ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు ఊపందుకుంటుండ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. ఇన్నాళ్ళ పార్టీ జాయింనింగ్స్‌పై మౌనంగా కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్‌లో కీలక నేతల చేరికలతో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హస్తం గూటికి చేరారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంత శ్రీదేవి.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న వారిలో ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ సైతం కాంగ్రెస్‌ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ ఉదయమే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు పంపించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు.

Patnam Mahender Reddy and his wife joined in congress
Patnam Mahender Reddy

ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. సరైన ప్రాధాన్యత దక్కట్లేదని పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వపరంగా తనకు అవకాశాలను కల్పించింనందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా పత్రాన్ని పంపించిన కొద్దిసేపటికే ఆమె భర్తతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. చేవేళ్ల లోక్‌సభ సీటుపై హామీతోనే పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవేళ్ల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో.. కాంగ్రెస్ కూడా నియోజకవర్గంపై పట్టున్న పట్నం ఫ్యామిలీని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దఫాలు చర్చలు జరిపిన పట్నం కుటుంబసభ్యులు ఎట్టకేలకు ఎంపీ సీటు కోసం లైన్ క్లియర్ కావడంతో సునీతా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago