OTT Suggestion : ఇటీవలి కాలంలో హరర్ సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. ప్రతి సినిమా కూడా వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులకి మంచి థ్రిల్ అందిస్తుంది. కంటెంట్ బలంగా ఉండి.. ట్విస్టులుంటే చాలు హిట్ అయ్యినట్లే. కానీ ఇటీవల కాలంలో వచ్చిన ఓ సినిమా మాత్రం థియేటర్లలో జనాలను భయంతో వణికించింది. విడుదలకు ముందే గర్బిణీ స్త్రీలు మా సినిమా చూడొద్దు అంటూ మేకర్స్ ప్రకటించడం మనం చూశాం. ఇప్పుడు అదే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘పిండం’ పేరుకు తగ్గట్టే కథ కూడా విభిన్నంగా సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీలో శ్రీరామ్ , ‘దియా’ ఫేమ్ ఖుషి రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించగా.. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు. టీజర్, ట్రైలర్‌తోనే క్యూరియాసిటిని కలిగించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 15న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మసూద, విరూపాక్ష చిత్రాల తర్వాత ఆ రేంజ్ రెస్పాన్స్ అందుకుని మంచి వసూళ్లు రాబట్టింది. 1930లలో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసిన వారికి గుండెల్లో గుబులు మొదలైంది. దర్శకుడు సాయికిరణ్ రాసుకొన్న స్టోరీ.. ఆ కథను చెప్పడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. భావోద్వేగంతో సాగే పాత్రలకు ఆయన ఎంచుకొన్న నటీనటులు ఈ సినిమాకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు.
ఫస్టాఫ్‌లో సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్ చెప్పడమే కాకుండా నిజంగా కొన్ని సీన్లలో భయపెట్టించే ప్రయత్నం చేశారు. సన్నివేశాల్లోని ఎమోషన్స్ పండించడానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్‌ను ఉపయోగించుకొన్న విధానం సినిమాకు మూడ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అంశాలతో రూపొందించిన చిత్రం పిండం. భావోద్వేగానికి గురిచేసే ఓ పాయింట్ చుట్టు అల్లుకొన్న థ్రిల్లర్ ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురి చేస్తుంది. చైల్డ్ సెంటిమెంట్ అంశాలు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.