Old Man Dance : చిరంజీవి.. ఓ అల్టీమేట్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి. వెండితెర హీరోయిజంకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చిరు.. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు.. ఇలా ఒక్కటేమిటి.. తెలుగు సినిమా గమనాన్ని మార్చేశారు. మహా నటుడు ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. ఒకప్పుడు తెరపై ఎన్టీఆర్ కనిపిస్తే థియేటర్లో నోట్ల వర్షం కురిసేది. ఆ తర్వాత చిరంజీవికి మాత్రమే అతంటి ఫాలోయింగ్ దక్కింది. అయితే చరిష్మా అంతా ఓవర్ నైట్ లో రాలేదు. ఎలాంటి బాగ్రౌండ్ లేకుండా తనకు తానే స్వయం కృషితో ఎదిగి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకొని ‘వన్ అండ్ ఓన్లీ’ మెగాస్టార్ గా అవతరించారు. రాజకీయాల వలన తొమ్మిదేళ్లపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన చిరు తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.
రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. రీసెంట్‌గా భోళా శంకర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమా తమిళ చిత్రం వేదాళంకి రీమేక్‌గా రూపొందగా, మెహర్ రమేష్ చిత్రాన్ని సరిగ్గా నడిపించలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.అయితే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. అయితే ఈ సినిమా టీజర్ లాంచింగ్ సమయంలో చిరు అభిమాని అతను కాళ్లలో స్ప్రింగ్‌లు పెట్టుకున్నట్టు డ్యాన్స్ చేసి రక్తి కట్టించాడు. చిరంజీవి స్టైల్‌లో బ్రేక్ డ్యాన్స్ చేస్తూ అదరహో అనిపించాడు. ఇప్పుడు ఆ ముసలి వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
చిరంజీవి స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుంటే స్వయంగా నటరాజు స్వామే నడుస్తున్నట్టు ఉంటుంది. కాలు కదిపితే థియేటర్లు దద్దరిల్లిపోయేవి.. డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి.. చిరు అంటే డ్యాన్స్.. అన్నంతగా తెలుగు సినిమా చరిత్రలో తన డ్యాన్సింగ్ స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేశారాయన.డ్యాన్స్‌లో చిరంజీవి ఈజ్, గ్రేస్, ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.. ఇన్నేళ్ల సినీ జర్నీలో ఎన్నో సూపర్ హిట్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నెంబర్స్ చిరు ఖాతాలో ఉన్నాయి. ‘ఛాలెంజ్’, ‘హీరో’,‘ దొంగ’, ‘జ్వాల’, ‘అడవి దొంగ’, ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన డ్యాన్స్ చేశారాయన.