Odisha Train Accident : ఒడిశాలో మహా ఘోరం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బహనగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు ఈ పెను విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మొత్తం మూడు రైల్లు ఢీకొన్న ఈ సంఘటనలో ఇప్పటి వరకు సుమారుగా 300 మందికి పైగానే చనిపోయారు. 1000 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. యావత్ దేశాన్ని ఈ సంఘటన ఒక్కసారిగా కుదిపేసింది. అయితే ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏమిటో బయట పడింది. ప్రత్యక్ష సాక్షి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ప్రమాదంలో బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, కోరమాండల్ ఎక్స్ ప్రెస్, మరో గూడ్స్ రైలు ఢీకొన్నాయి. అయితే కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తూ ప్రమాదం నుంచి ఎలాంటి గాయాలు లేకుండా బయట పడిన అనుభవ్ దాస్ అనే ప్రయాణికుడు ఈ ఘోర సంఘటనకు చెందిన వివరాలను.. ప్రమాదం ఎలా జరిగింది.. అనే విషయాలను మీడియాకు తెలియజేశాడు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి లూప్ లైన్ ట్రాక్‌లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌కు చెందిన బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది. దీంతో మూడు రైళ్లే ఢీకొనే సరికి ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది. కాగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇక ఒక ట్రాక్‌పై రైళ్లు రెండూ వస్తే అలర్ట్ చేసే యాంటీ ట్రెయిన్ కొల్లిజన్ సిస్టమ్ ఆ రూట్‌లో అందుబాటులో లేదని రైల్వే శాఖకు చెందిన ఓ ప్రతినిధి వెల్లడించారు. ఆ వ్యవస్థ ఉండి ఉంటే ఇంతటి పెను ప్రమాదం చోటు చేసుకుని ఉండేది కాదని అన్నారు. ఈ క్రమంలోనే ఈ సంఘటనతో ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. రైలు ప్రమాదం అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఎన్నో రైలు ప్రమాదాలు చోటు చేసుకోగా ఇదే అతి పెద్ద ప్రమాదమని భావిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…