Nymisha Reddy : నాన్న‌కి హోం మినిస్ట‌ర్ మా మ‌మ్మీనే.. రేవంత్ కూతురు ఆస‌క్తిక‌ర కామెంట్స్..

Nymisha Reddy : తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల‌లో చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన రేవంత్ ఇప్పుడు సీఎం అయ్యాక కూడా అంతే దూకుడుగా డెసిష‌న్స్ తీసుకుంటుంటున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ‘ప్రజాదర్బార్’ వంటి కార్యక్రమాలతో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించారు. సీఎం అయ్యాక రేవంత్‌కి సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఏబీవీపీ లీడర్ గా ఉస్మానియా వర్శిటీలో ఉద్యమాలు నిర్వహించేవారు. అలా ఇంటర్ చదివే రోజుల్లో ఆయన నాగార్జున సాగర్ వెళ్లినప్పుడు గీతారెడ్డిని తొలిసారి చూశారట.

అక్కడ మొదలైన పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత ప్రేమగా మారిందట. మొదట రేవంత్ రెడ్డే ప్రపోజ్ చేయగా, ఆయన వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నచ్చి గీతారెడ్డి కూడా ఓకే చెప్పేశారట. అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. మొదట్లో వీరి ప్రేమ విషయం తెలిసిన గీతారెడ్డి నాన్న వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదట. రేవంత్ లోని మొండితనం, ధైర్యం, చురుకుతనం గమనించి జైపాల్ రెడ్డి తనను ఒప్పించినట్లు గీతా రెడ్డి తండ్రి వెల్లడించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం తనకు కూడా నచ్చడంతో తన కుమార్తె గీతారెడ్డితో పెళ్లికి ఓకే చెప్పినట్లు వివరించారు. ఇలా రేవంత్ రెడ్డి, గీతారెడ్డి పెద్దల సహకారంతో, అందరి సమక్షంలో 1992లో వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ కుమార్తె నైమిష‌ ఉన్నారు.

Nymisha Reddy interesting comments on her father revanth reddy
Nymisha Reddy

నైమిష‌కి సంబంధించి తాజాగా ఒక వీడియో విడుద‌ల కాగా, అందులో తన తండ్రి గురించి అనేక విషయాలు చెప్పింది. డాడి మా మ‌మ్మిని హోం మినిస్ట‌ర్ అని పిలుస్తారు. డాడి బ‌య‌ట రాజ‌కీయాలు ఇత‌ర‌త్రా వంటి విష‌యాల‌తో బిజీగా ఉంటుండ‌గా, ఇంట్లో మా మ‌మ్మి అన్ని చ‌క్క‌ప‌రుస్తుంది. మ‌మ్మి సైడ్, డాడి సైడ్ వాళ్లని కూడా మ‌మ్మి మేనేజ్ చేస్తుంది. మా ఇంటికి హోమ్ మినిస్ట‌ర్ మా మ‌మ్మీనే. నాకు, డాడికి అప్పుడ‌ప్పుడు ఏదైన గొడ‌వ అయిన కూడా మ‌మ్మీనే ఏదో ఒక‌టి చెప్పి మాట్లాడేలా చేస్తుంద‌ని నైమిష పేర్కొంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago