Posani Krishna Murali : ఈ సారి ఏపీ రాజకీయాలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోతుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుందని చాలా మంది అంచనా వేశారు. అయితే కూటమి తుపానుకి వైసీపీ ఇలా కొట్టుకుపోతుందని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. అయితే వైసీపీ ఓటమితో ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన చాలా మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిలో ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు. . వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక్షసులు అని ఇంతకాలం మీడియా ముందు పోసాని కృష్ణ మురళి పదేపదే ఆరోపణలు చేశారు.
మాకులం నాయకులను నేను వ్యతిరేకిస్తున్నానని, పేదలకు మంచి చేసే జగన్ ను తాను గౌరవిస్తానని పోసాని కృష్ణ మురళి ప్రగల్భాలు పలికారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి పోసాని కృష్ణ మురళి నోటికి వచ్చినట్లు విమర్శించారు. పోసాని కృష్ణ మురళిని పవన్ కల్యాణ్ విమర్శించకపోయినా పవర్ స్టార్ అభిమానులు, మెగా అభిమానులు ఎప్పటికప్పుడు పోసాని కృష్ణ మురళికి చివాట్లు పెడుతూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోసాని పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. జగన్ తనను ఉద్దరిస్తాడని అనుకున్న పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్ తో పెట్టుకుని పెద్ద తప్పు చేశాడని సినీ అభిమానులు అంటున్నారు.

తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా టీడీపీ అననూయలందరిపై పోసాని నిప్పులు చెరిగిన సందర్భాలెన్నో. ఇవన్నీ కూడా పోసాని వృత్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తాయా? అన్నది మీడియాలో వాడి వేడిగా సాగుతోన్న చర్చ.ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం, ఇటు మెగా ఫ్యామిలీతో పోసాని పెట్టుకోవడం ఆయనకి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. పోసాని వైపు ఏ దర్శక నిర్మాతలు కూడా కన్నెత్తి చూడడం లేదనే టాక్ కూడా నడుస్తుంది. ఈ క్రమంలో పోసాని కెరీర్‌కి పులిస్టాప్ పడ్డట్టేనా అనేది వేచి చూడాలి.