Nithya Shetty : చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారడమే కాక తమ అందచందాలతో ప్రతి ఒక్కరికీ షాక్ ఇస్తున్నారు. దృశ్యం పాప ఎస్తేర్ ఇటీవలి కాలంలో హాట్‌నెస్‌తో ఎంతలా మైండ్ బ్లాక్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు దేవుళ్లు సినిమాలో నటించిన చిన్నారి కూడా ఎక్కడా తగ్గనంటుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెని చూస్తే దేవుళ్లు సినిమాలో నటించిన చిన్నారేనా అని ఆశ్చర్యపోక మానరు.
దేవుళ్లు అనే మూవీ.. వచ్చి దాదాపు దశాబ్ద కాలం పూర్తయింది. ఆనాడు ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో నీ ప్రేమ కోరే చిన్నారులం అనే పాటతో వారి తల్లిదండ్రుల మనసును కదిలించి సినిమాలో నటించిన ఆ బాలనటి పేరు నిత్యా శెట్టి. ఈ చిత్రంలో తన నటనకు గాను ఏకంగా నంది అవార్డు తెచ్చుకుంది. అలాగే చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ తోనూ నిత్యాశెట్టి ఎంతో మందిని ఆకట్టుకుంది. అప్పట్లో ఈ పిల్ల నటన గురించే ప్రతి తెలుగు ఇంట్లోనూ చర్చించుకునే వారు. అయితే నిత్యాశెట్టి తెలుగు అమ్మాయి కాదు తమిళ పిల్ల.
దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేసిన నిత్య రెండు సార్లు నంది అవార్డును కూడా గెలుచుకుంది. దీని తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఈ అమ్మాయి. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా చేసింది. ఇక కొద్ది రోజుల తర్వాత జాబ్‌కి రిజైన్ చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దాగుడుమూత దండాకోల్ అనే మూవీలో నటించింది. అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అప్పుడప్పుడు తన అందచందాలతో సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…