Nithya Menen : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ గురించి పలువరు పలు రకాల కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మలయాళ కుట్టీ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షించింది. అలా మొదలైంది సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చబ్బీ కేరళ కుట్టి నిత్యామీనన్ కొద్దిసినిమాలే చేసినా గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే నటిగా మంచి మార్కులు కొట్టేస్తుంది. హీరోయిన్ గానే నటించాలనేది లేకుండా పాత్ర నచ్చితే అతిధి పాత్ర నుండి ఏదైనా చేసేందుకు ఒకే చెప్పే ఈ అమ్మడు ఈ మధ్యనే స్కైలాబ్ సినిమాతో నిర్మాతగా కూడా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిత్యా ప్రస్తుతం స్కైలాబ్ ప్రమోషన్ లో బిజీగా ఉంది.ఈ ప్రమోషన్‌లో భాగంగా నిత్యా మీనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలిచింది. ప్రభాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి.. ? అనే ప్రశ్న ఎదురు కాగా, దానికి నిత్యా మీనన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నిత్యా మీనన్ చేసిన ఈ కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు .. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు కూడా సరిగా వచ్చేది కాదని.. అందుకే టాలీవుడ్ సినిమాలు చూసేదాన్నికాదు. అలా అప్పటికి నేను ప్రభాస్ సినిమాలేవీ చూడలేదు. అప్పుడు నన్ను ఆయన గురించి గురించి అడిగితే నాకు తెలియదని చెప్పాను.
అయితే, నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్న మీడియా.. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేసి ఆ విషయాన్ని పెద్దది చేశారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. ఆ వివాదంతో అన్ని చోట్ల నిజాయితీగా ఉండకూడదని.. ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైందని చెప్పుకొచ్చింది నిత్యా. నిత్యా మీనన్ ని ట్రోల్ చేశారు. అలా ఇలా ట్రోలింగ్ కాదు. నిత్యాకు పొగరు ఎక్కువ అని, ఆమె ఎవరిని లెక్క చేయదు అని.. ఇంకా దారుణంగా తిట్టిపోశారు. ఇక అప్పుడే ఈ చిన్నది రియలైజ్ అయ్యింది. అప్పటికప్పుడే ఆమె.. తన తప్పును సరిదిద్దుకుంది. =నిజంగా ప్రభాస్ తెలియదని, అందుకే అలా మాట్లాడానని చెప్పుకొచ్చింది. నిజం చెప్పినా తప్పు అంటే తాను చేసేది ఏం లేదని కూడా తెలిపింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏదో ఒక సమయంలో ఈ వివాదంపై నిత్యా స్పందిస్తూనే ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…