Nirmala Sitharaman : ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.. ఆసియా ఖండంలోని ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ. 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(NACIN) పెనుకొండ నియోజకవర్గంలో ఏర్పాటైంది. ఈ శిక్షణా కేంద్రాన్ని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి అనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిక్షణా కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మించారు.
ఐఏఎస్‌లకు ముస్సోరిలో, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని కూడా తీసుకొచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో పని చేసే సిబ్బంది పిల్లల విద్య కోసం నాసిన్ సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. మరోవైపు ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మస్థలం. లేపాక్షిలో వీరభద్ర స్వామి మందిరం దర్శించుకోవడం ఆనందకరం. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. జీఎస్టీ తీసుకొచ్చి పన్నులను సరళతరం చేశాం. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలి. ఇదే రామరాజ్య సందేశం” అని ప్రధాని మోదీ అన్నారు.
నాసిన్ దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నాసిన్ శిక్షణా కేంద్రాన్ని మోడీ ప్రారంభించిన సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి నాసిన్‌లో శిక్షణ ఇస్తామని, ప్రపంచ కస్టమ్స్ సంస్థ కూడా నాసిన్‌కు గుర్తింపు ఇచ్చిందని, నాసిన్ అతి త్వరలో అంతర్జాతీయ శిక్షణా కేంద్రంగా మారనుందని చెప్పారు. నాసిన్ ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం 500 ఎకరాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం, తాగునీటికి తగిన ఏర్పాటు చేశారని ప్రశంసించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…