Archana : ఒకప్పుడు తెలుగు తెరని ఏలిన అందాల భామలు పలు కారణాల వలన పరిశ్రమకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అర్చన లేడీస్ టైలర్, నిరీక్షణ లాంటి సినిమాలతో ప్రేక్షకుల మదిని దోచింది. సీనియర్ హీరోయిన్ అర్చన కూడా రీఎంట్రీ ఇచ్చింది. ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన చాలా కాలం తర్వాత తెలుగులో నటించింది.. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్‌తో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. గెహన సిప్పీ ఈ సినిమాలో నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి లాంటి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.
భానుచందర్ హీరోగా నటించిన నిరీక్షణ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకుడు. ‘నిరీక్షణ’ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. హీరోయిన్ అర్చనకు కూడా మంచి గుర్తింపే లభించింది. తరువాత కూడా ‘లేడీస్ టైలర్’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. అయితే 3 ఏళ్ళకే టాలీవుడ్ కు ఈమె దూరమయ్యింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత చోర్ బజార్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
ఇటీవల ఓ టీవీ షోలో అర్చన ‘నిరీక్షణ’ చిత్రం గురించి కూడా స్పందించింది. ‘ఆ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు జాకెట్ లేకుండా నటించినట్టు చెప్పుకొచ్చింది. ట్రైబల్ మహిళ పాత్రలో నటించడం వలన జాకెట్ లేకుండా నటించాను.అలా అని అది బోల్డ్ పాత్ర అని చెప్పలేము.కానీ నాకు మా మాత్రం ఆ పాత్ర మంచి పేరుతెచ్చిపెట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది అర్చన. అయితే ఈ మధ్య కాలంలో తాను చాలా సినిమాలను చూసానని కానీ తనకు మాత్రం కీర్తి సురేష్ నటించిన “మహానటి” చిత్రం మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి “జనతా గ్యారేజ్” చిత్రాలు ఎంతగానో నచ్చాయని చెప్పుకొచ్చింది.