Niharika Konidela : మెగా ఫ్యామిలీలో ఏపీ ఎన్నికల తర్వాత విభేదాలు మరింత ముదిరాయి.మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండటం లేదని.. దీనికి బన్నీ వైఖరే కారణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా ‘చెప్పను బ్రదర్ ‘ ఇష్యూ నుంచి కుటుంబంలో చీలిక వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా పంపింది. ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఇది తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్‌తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ బద్ధ వ్యతిరేకి వైఎస్ జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ మెగా, జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు. అయితే ఫలితాల రోజున అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓటమి పాలయ్యారు. ఈ రిజల్ట్‌తో అభిమానులు మరోసారి బన్నీని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో ఆన్ ఫాలో చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్‌ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు శిరీష్‌ని మాత్రమే సాయి ఫాలో అవుతున్నారు.
ఈ విషయంపై తాజాగా నిహరిక కొణిదెలా స్పందించింది. నిహరిక కొణిదెలా సమర్పణలో వస్తున్న తాజా చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఈ సినిమా టీజర్ వేడుకలో పాల్గోన్న నిహరికను ఒక రిపోర్టర్ సాయితేజ్ – అల్లు అర్జున్ వివాదం విషయం అడుగగా ఆమె స్పందించింది. నిహరిక మాట్లాడుతూ.. అల్లు అర్జున్ను సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేసిన విషయం తనకు తెలియదని. ఎందుకు అన్‌ఫాలో చేశాడో.. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. దీంతో నిహారిక చాలా తెలివిగా స్పందించిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.