Niharika Konidela : మెగా బ్రదర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు యాంకర్‌గా సత్తా చాటిన ఈ భామ ఆ తర్వాత నటిగా మారింది.ఇప్పుడు నిర్మాతగాను సత్తా చాటుతుంది. ఇప్పుడు నిహారిక నిర్మించిన తాజా చిత్రం కమిటీ కుర్రోళ్లు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహించాడు. ఇక సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రోమోలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అలాగే అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో నాగబాబు, హైపర్ ఆది కామెంట్స్ బాగా వైరల్ అవుతుండగా, నిహారిక మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల స్పీచ్ వైరల్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డమని సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నామని, అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా వచ్చిన వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, అడవి శేష్ కి సస్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. ఇక తన స్పీచ్ చివర్లో మెగా ఫ్యామిలీ గురించి చెప్తూ.. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి అద్భుతంగా ఉంది. “మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్ కి వెళ్లింది”… “మా పెదనాన్నకి పద్మవిభూషణ్ వచ్చింది.
మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు”.. అలాగే నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను… అదే ఊపులో సినిమా హిట్ చేసెయ్యండ్రా ప్లీజ్ అంటూ ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసింది. ఇక నిహారిక లాస్ట్ లో చేసిన ఆ కామెంట్స్ మాత్రం ఫ్యాన్స్ కి ఊపు తీసుకొచ్చిందని చెప్పాలి. నెట్టింట నిహారిక చేసిన ఈ వ్యాఖ్యల్ని ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ ఎన్నో విషయాల మీద స్పందించాడు. సినిమా సంగతులు చెబుతూనే.. తన ఫ్యామిలీ మెంబర్లు, కుటుంబ వారసత్వ విమర్శల గురించి కూడా స్పందించాడు. ఆడవాళ్ల రక్షణ కోసం ఇరు ప్రభుత్వాలు ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటాయని అన్నాడు.తన ఫ్రెండ్ ఫణి ఈ కథను ముందుగా తనకు వినమని చెప్పాడట. కానీ ఇంట్రెస్ట్ లేక వినలేదట. కథను విన్న నిహారిక.. తనకు మళ్లీ వినమని సలహా ఇచ్చిందట. ఆ కథ విన్నాక చాలా నచ్చిందట. అయితే ఈ చిత్రంలో అందరూ కొత్త వారుంటే బాగుంటుందని అనుకున్నాడట నాగబాబు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…