Sim Card : సిమ్ కార్డ్స్ వలన ఎంతటి మోసాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో కేంద్రం కొత్త రూల్స్ తెచ్చి మోసాలకి చెక్ పెట్టాలని అనుకుంటుంది. కేంద్రం కొత్త రూల్స్ ప్రకారం.. సిమ్ కార్డు డీలర్లకు ఇకపై పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. సిమ్ కార్డులు విక్రయించే డీలర్లను ముందుగా పోలీసులు వెరిఫై చేస్తారు. ఆ తర్వాతే వారి నుంచి సిమ్ కార్డుల జారీ ఉంటుంది. మరోవైపు.. ఇకపై బల్క్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండదు. బల్క్ సిమ్ కార్డుల జారీని కేంద్రం రద్దు చేసింది. సిమ్ డీలర్లు నిబంధనలను అతిక్రమిస్తే.. ఏకంగా రూ. 10 లక్షల వరకు పెనాల్టీ పడుతుంది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ కొత్త సిమ్ కార్డు రూల్స్‌ను ప్రకటించారు. ఈయన ప్రకారం.. సిమ్ కార్డు డీలర్లకు ఇకపై పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది తప్పనిసరి. ఎవరైతే సిమ్ కార్డులు విక్రయించే డీలర్లు ఉన్నారో వారిని పోలీసులు వెరిఫై చేస్తారు. అంతేకాకుండా ఇకపై బల్క్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండదే. మోసాలకు అడ్డు కట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ బల్క్ కనెక్షన్ కేటాయింపును రద్దు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఇప్పటికే బల్క్ కనెక్షన్స్ కేటాయింపును తొలిగించిందని ఆయన తెలిపారు. ఈ సర్వీసుల స్థానంలో కొత్తగా బిజినెస్ కనెక్షన్స్ అనే కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు.
2023 మే నెల నుంచి చూస్తే సిమ్ కార్డు డీలర్లపై 300 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయని వివరించారు. అలాగే వాట్సాప్ కూడా దాదాపు 66 వేల అకౌంట్లను బ్లాక్ చేసిందని తెలిపారు. మోసపూర్తిత లావాదేవీలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. కేంద్రం కొత్త రూల్స్ వల్ల మోసాలకు అడ్డు కట్ట పడే అవకాశం ఉంది. ఇకపై సిమ్ కార్డు డీలర్లపై డేగ కన్ను ఉండనుంది.వాట్సాప్ కూడా దాదాపు 66 వేల అకౌంట్లను బ్లాక్ చేసిందని గుర్తు చేశారు. మోసపూర్తిత లావాదేవీలు ఇందుకు కారణమని పేర్కొన్నారు.