Neha Sharma : రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుత చిత్రం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్, నేహా శర్మ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరికి మంచి వినోదాన్ని పంచింది. అయితే నేహా తన ఫస్ట్ మూవీ చిరుతతోనే భారీగా క్రేజ్ సంపాదించుకుంది. నేహా శర్మ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయిన సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చకి రోజురోజుకి అభిమానగణం పెరుగుతూ పోతుంది. సోషల్ మీడియాలో ఈ అమ్ము పిక్స్ షేర్ చేస్తే అవి వైరల్ కావల్సిందే.
నేహా శర్మ తాజాగా నటించిన బాలీవుడ్ సినిమా జోగిరా సారా రారా . ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలకి సిద్ధమవుతుండగా, ఈమూవీ ప్రమోషనర్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు టీమ్. ఇక ఈసినిమాలో హీరోగా బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధి నటించగా.. ఆయనతో కలిసి ప్రమోషన్స్ చేస్తోంది బ్యూటీ. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని, , ప్రస్తుతం వారు చేస్తున్న హంగామా చూస్తుంటే నేహా నవాజ్ ప్రేమలో పడ్డారనే అనుమానం కలుగుతుంది అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కొద్ది రోజులుగా వీరిద్దరు కలిసి తెగ తిరుగుతుండటం.. వీరి ప్రవర్తలో మార్పు కనిపిస్తుండటంతో.. డైరెక్టుగా వీరిపై పెళ్లి పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అటుసోషల్ మీడియా జనాలు కూడా వీరిద్దరి మధ్య అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే నేహా శర్మ త్వరలో పెళ్లి కబురు చెప్పిన ఆశ్చర్చపోనక్కర్లేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి దీనిపై నేహా ఏమైన స్పందిస్తుందా అని.