Nasser : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్ కి వెంట‌నే స్పందించిన కోలీవుడ్ ప్ర‌ముఖులు

Nasser : న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా స‌త్తా చాటుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు త‌న ప్ర‌సంగాల‌తో అంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాడు. రాజ‌కీయ స‌భ అయిన‌, సినిమా ఫంక్ష‌న్ అయిన స‌రే ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు కొన్ని హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. సిని పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కళాకారులను ఆహ్వానిస్తుంది. కోలీవుడ్‌లో కూడా ఇలాగే కొనసాగితే పరిశ్రమ మంచి స్థాయికి చేరుతుంది అని అన్నారు.

తమిళ పరిశ్రమ తమిళం వారికే అంటే పరిశ్రమ ఎప్ప‌టికీ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందీ అంటే అన్ని పరిశ్రమల వారినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టే. ఒక్కళ్ళు కాదు, అన్ని భాషల్లో కలయిక ఉంటేనే సినిమా అవుతుంది తప్ప.. ‘ఇది మన భాష. మనమే ఉండాలి’ అంటే.. కుంచించుకుపోతాం. మీరు కూడా తమిళ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా అని ప‌వ‌న్ చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలతోపాటు సోషల్‌ మీడియాలో తమిళ పరిశ్రమపై జరుగుతున్న చర్చపై నడిగర్‌ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్ స్పందించారు.

Nasser first reaction on pawan kalyan comments
Nasser

తమిళ సినిమాల్లో తమిళ నటులే నటించాలని, ఇతరులకు అవకాశం లేదని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదు. ఒకవేళ కోలీవుడ్‌లో అలాంటి ప్రతిపాదన వస్తే మొదటగా నేనే ప్ర‌శ్నిస్తాను. మనమంతా పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్థాయి చిత్రాలు చేస్తున్నాం. ఏ సినిమా పరిశ్రమకైనా ఇతర భాషల ఆర్టిస్ట్‌ల అవసరం త‌ప్ప‌క‌ ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఎవరూ ఈ తరహా నిర్ణయాలు తీసుకోరు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ కార్మికుల కష్టాలు తీర్చేందుకు సెల్వమణి ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే అందులో పర భాషా ఆర్టిస్ట్‌లు ఉండకూడదు అన్న ప్రస్తావన అయితే లేదు. తమిళ చిత్ర పరిశ్రమకు ఓ ట్రెడిషన్‌ ఉంది. ఎస్వీ రంగారావు, సావిత్రమ్మ, వాణిశ్రీలాంటి ఎందరో అగ్రతారలు తమిళ సినిమాలో భాగమై ఉన్నారు. ఆ సంప్ర‌దాయం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి త‌ప్పుడు వార్త‌ల‌ని నమ్మవద్దు. బాషా బేధాలు లేకుండా అందరం కలిసి పని చేద్దాం. ఇండియన్‌ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం అని నాజ‌ర్ త‌ను రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago