Nara Lokesh : ఈ రోజు ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నుకోబడ్డారు. ఆయన గురించి ప్రతి ఒక్కరు గొప్పగా మాట్లాడారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని కొనియాడారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉందన్నారు. ఒకే పార్టీ.. ఒకే జెండా.. ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్నపాత్రుడని పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్షకట్టిందని నారా లోకేష్ తెలిపారు.
అయ్యన్నపాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని లోకేష్ గుర్తు చేశారు. రాజకీయాలు చూస్తూ పెరిగిన వ్యక్తిని తానని.. గతంలో సభ ఎంతో హుందాగా జరిగేదన్నారు. గత ఐదేళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవహరించిందన్నారు. సభ సంప్రదాయాలను గౌరవించేలా.. సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని స్పీకర్‌ను లోకేష్ కోరారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా.. సభలో ప్రతిపక్షం లేకపోయినా.. మనమే ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. అయ్యన్నపాత్రుడిపై ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పోరాడారన్నారు. అయ్యన్నపాత్రుడి నుంచి నేర్చుకోవల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని నారా లోకేష్ అన్నారు.

ఆయనకు గతంలో క్షణికావేశం ఉండేదని.. ఇక ఆ అవకాశం లేకుండా పోయిందని నవ్వులు పూయించారు. 25 ఏళ్ల వయస్సులోనే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తు చేశారు. ఏడు సార్లు ఒక్క నియోజకవర్గం నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం గొప్పవిషయమన్నారు. తాను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న పాత్రుడి సలహాలు తీసుకున్నానని గుర్తు చేశారు.ఇక తమకు పవన్ కల్యాణ్ ఎంతో సపోర్ట్ గా నిలిచారని, పవన్ అన్న తీసుకున్న నిర్ణయం, ఆయన చేసిన కృషి వలన ఈ రోజు నేను ఐటీ మినిస్టర్ అయ్యానంటూ నారా లోకేష్ తెలియజేశారు.