Nara Lokesh : ఈ సారి ఏపీలో టీడీపీ ప్రభుత్వం జనసేనతో కలిసి గట్టి పోటీ ఇవ్వనుందని చాలా మంది జోస్యం చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గట్టి పోరాటం చేస్తున్నారు. అయితే నారా లోకేష్ గత కొద్ది రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తుండగా, అది పూర్తి కానుందని తెలుస్తుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన పాదయాత్రను నేటితోముగించనున్నారు. 226రోజుల్లో 3132 కి.మీ.ల పొడవున యువగళం పాదయాత్ర సాగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్,రిమాండ్ నేపథ్యంలో మధ్యలో కొంత కాలం పాదయాత్ర నిలిచిపోయింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది.
రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది.పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామం లేకుండా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షాన్నిలో సైతం యాత్రను కొనసాగించారు.
![Nara Lokesh : పవన్ కళ్యాణ్‌తో తన కటౌట్ చూసి షాకైన లోకేష్..! Nara Lokesh surprised by his photo with pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/12/nara-lokesh-1.jpg)
యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగసభలు, 155ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలనుంచి రాతపూర్వకంగా 4,353వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. ఇక పాదయాత్రలో లోకేష్ ముందుకు సాగుతుండగా, పెద్ద కటౌట్ ప్రత్యక్షం కావడంతో లోకేష్ షాకయ్యారు. దాదాపు ఈ కటౌట్ వంద అడుగులు ఉందని తెలుస్తుండగా, ఈ కటౌట్‌లో లోకేష్‌తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు.