Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో చర్చకు సిద్ధమా అంటూ అనిల్ విసిరిన సవాల్ కి ప్రతి సవాల్ విసిరారు నారా లోకేష్. తాను చర్చకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. చర్చకు వచ్చేటప్పుడు సీఎం జగన్ ని కూడా తీసుకు రావాలని చెప్పారు. నెల్లూరు యువగళం పర్యటనలో భాగంగా నాయుడుపేట సభలో నారా లోకేష్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కి సవాల్ విసిరారు. వచ్చేసారి నెల్లూరు సిటీ టికెట్ నీదే అని జగన్ తో చెప్పించగలవా అని ఛాలెంజ్ చేశారు.
సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్.. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ సిల్లీ బచ్చా నాతో చర్చ అంటూ సరదా పడుతున్నాడంట.. రా రా వచ్చెయ్ అంటూ నాయుడుపేట సభ నుంచి పిలుపునిచ్చారు నారా లోకేష్. అవినీతి సొమ్ముతో ఆయన కొన్న పొలం దగ్గర చర్చ పెట్టుకుందామా అని అడిగారు. చర్చకు వచ్చేటప్పుడు జగన్ ని కూడా తీసుకు రావాలన్నారు. తాను నాయుడుపేటలోనే ఉన్నా వచ్చెయ్ అంటూ పిలిచారు లోకేష్. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తియ్యకపోవడం వలన చేపలు పట్టుకోవడానికి వీలులేక ఇబ్బంది పడుతున్నామన్నారు. తమిళనాడు జాలర్లు దాడులు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం హయాంలో బోట్లు, వలలు ఇచ్చే వారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదని చెప్పారు. డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. జగన్ పాలనలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చెయ్యకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో మత్స్యకారులు చనిపోతే రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందేదని.. జగన్ పాలనలో మత్స్యకారులు చనిపోతే భీమా అందడం లేదని గూడూరు నియోజకవర్గం మత్స్యకారులు వెల్లడించారు. లోకేష్.. నేరుగా అనిల్ పేరెత్తలేదు కానీ.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ సీటు ఆయనకి ఇస్తారా అని ప్రశ్నించారు. అలా ఇస్తారని సీఎం జగన్ తో చెప్పించగల దమ్ము అనిల్ కి ఉందా అని ప్రశ్నించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…