Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో చంద్రబాబు తండ్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడు లండన్‌కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం” అని నారా లోకేష్ మండిపడ్డారు. ” నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్” అని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. నా తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారు. చూడటానికి వెళుతున్న నన్ను నడిరోడ్డుపై నిర్బంధించారు.
నా పాదయాత్రపై వైకాపా రౌడీమూకలతో దగ్గర ఉండి రాళ్లు వేయించిన పోలీసులు, యువగళం వలంటీర్లపై ఎటాక్ జరిగిందని ఫిర్యాదులు ఇస్తే, రివర్స్ కేసులు వారిపైనే బనాయించిన పోలీసులు నాకు రక్షణ కల్పిస్తారట! సిగ్గు! సిగ్గు!” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయన్ని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 37వ ముద్దాయిగా చంద్రబాబు ఉన్నారని వివరించారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను ఎందుకు రిమాండ్ చేస్తున్నారో చెప్పి, అరెస్టు చేయాలని చంద్రబాబు అన్నారు. ప్రైమా ఫేసీ లేకుండా అరెస్టు చెయ్యడానికి ఏం అధికారం ఉంది అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ దేశంలో తాను ఓ నెటిజన్ అన్న చంద్రబాబు.. తనను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, ఉరి తియ్యాలని చంద్రబాబు అన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని అయిన తనను అరెస్టు చెయ్యడానికి అర్థరాత్రి రావాల్సిన అవసరం ఏముందన్న చంద్రబాబు.. ఇదంతా అరాచకం కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు ఎంపీ రఘరామ. “ఆయనను ఎలాగైనా అరెస్టు చేయాలన్న కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఈ విధంగా తీర్చుకోవడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజు. వైఎస్ జగన్ప తనానికి ఇది పునాది. ఎంతో ప్రతిష్టాత్మకమైన G20 సదస్సు ఢిల్లీలో జరుగుతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాలకు ఎంతో సుపరిచితుడైన చంద్రబాబు గారిపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.