Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ తర్వాత యువగళంకి కొంత బ్రేక్ ఇచ్చిన నారా లోకేష్ ఇప్పుడు తిరిగి మొదలు పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. నా పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నేతల విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అక్రమ కేసుల పెట్టి వేధించారని, ఇలాంటి కేసులకు భయపడే కుటుంబం మాది కాదన్నారు. సీఎం జగన్ మాట విన్న అధికారులు దిల్లీకి క్యూకడుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కలవకూడదని సీఎం జగన్ చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
తన సన్నిహితుడికి జగన్ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? అని ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ‘ఏమ్మా భారతీ రెడ్డి గారు తప్పుడు సాక్షి పత్రిక కు సిగ్గు అనేది లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు వైసీపీ పాలనలో టీడీపీ బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? అని నారా లోకేష్ ప్రశ్నించారు.జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. బాంబులకే భయపడని వాళ్లం, కోర్టులు, కేసులకు భయపడతామా? అన్నారు. ఏపీలో నిశబ్ద యుద్ధం జరగబోతుందన్న లోకేశ్, వంద సంక్షేమ పథకాలను తొలగించిన ఏకైక వ్యక్తి జగన్ అని సెటైర్లు వేశారు.
టీడీపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మూడు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాడుతుందని లోకేశ్ అన్నారు. విషపూరితమైన మద్యాన్ని సీఎం జగన్ అమ్ముతూ డబ్బులు దోచుకుంటున్నాడని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సైకో జగన్ తనకి నచ్చినట్టు చేయోచ్చు అని అనుకున్నాడు. కాని పవన్ కళ్యాణ్ అన్న వచ్చి జైలు ముందే పోత్తు ప్రకటించడం దాంతో జగన్‌కి మైండ్ బ్లాక్ కావడం జరిగిందని పేర్కొన్నారు నారా లోకేష్.