Nara Lokesh : చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గత కొద్ది రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన కూడా నారా లోకేష్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. జనాల సమస్యలని ఓపికగా వింటూ వారి సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు లోకేష్. అయితే ఇటీవల లోకేష్‌కి పెద్ద ప్రమాదమే తప్పింది. పాదయాత్రకు భారీగా జనం రావడంతో తోపులాట జరిగింది. దీనితో వారంతా ఒక్కసారిగా లోకేష్ మీద పడిపోయారు. ఈ ఘటనలో నారా లోకేష్ కిందపడబోయారు. ప్రజలు లోకేష్ మీద పడడంతో అతని కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో నారా లోకేష్ కి పెను ప్రమాదం తప్పింది.
రోజు రోజుకూ లోకేష్ పాదయాత్ర జనసంద్రం అవుతోంది. నారా లోకేష్‌ని చూడాలని, కరచాలనం చేయాలని జనం ఉత్సాహం చూపిస్తున్నారు.ఇదే అదనుగా పాదయాత్రలో తొక్కిసలాటలకి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు.. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పాదయాత్రలో పోలీస్ భద్రత తగ్గించింది.ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం పాదయాత్ర జనసంద్రం అవుతోంది. లోకేష్‌కి రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ విఫలమవుతోంది. భద్రత కల్పించకుండా పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. పోలీసులు ఎలాంటి భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో అక్కడక్కడ తోపులాటాలు జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
![Nara Lokesh : ఇంగ్లీష్‌లో అదరగొట్టిన నారా లోకేష్.. ఫిదా అయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. Nara Lokesh english speed software employees impressed](http://3.0.182.119/wp-content/uploads/2023/08/nara-lokesh-1.jpg)
ఇటీవల నారా లోకేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. దానికి నలుమూలల నుండి చాలా మంది ఉద్యోగులు హాజరు కాగా, వారందరు కూడా తమ సమస్యలు చెప్పుకొచ్చారు. వారి సమస్యలని చాలా ఓపికగా వింటూ నారా లోకేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంతేకాదు ఇంగ్లీష్‌లో మాట్లాడి అదరగొట్టారు. నారా లోకేష్ స్పీచ్ విన్న తర్వాత అందరిలో ధైర్యం వచ్చింది. తమకు ఎంతో కొంత న్యాయం చేస్తారనే ఆశ వారలో ఏర్పడింది.