Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని.. అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేశారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్‌బాబులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు లోకేష్.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయన్నారు నారా లోకేష్. ఈ విషయాన్నే గవర్నర్‌కు వివరించామని తెలిపారు. బాపట్ల జిల్లాలో బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్ పోసి వైఎస్సార్‌సీపీ నేతలు తగులబెట్టారన్నారు. దళిత వర్గానికి చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడి చేసి మూత్రం పోసిన ఘటననూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆయనకు వివరించామన్నారు.ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్‌ను సైతం తుంగలో తొక్కి.. గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించామన్నారు లోకేష్. ప్రతిపక్షాలపై జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందన్నారు లోకేష్. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన విధానాన్ని గవర్నర్‌కు తెలిపామన్నారు. ఈ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామన్నారు. టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు బనాయించారని.. ఈ విషయాన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక చివరిగా సాక్షి వాళ్లు రాలేదా అని అడిగారు. ఆ మీడియా రిపోర్టర్ లేకపోవడంతో టీవీ 9, ఎన్టీవీ వాళ్లు వచ్చినట్టున్నారుగా, మీరు ఎవైన ప్రశ్నలు వేస్తారా అని అన్నాడు. నేను ఎక్కడికి వెళ్లడం లేదు ప్రశ్నలు ఏమైన ఉంటే అడగమని అన్నాడు లోకేష్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…