Nara Lokesh : గత కొద్ది రోజులుగా నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మంగళగిరి సమీపంలోని యర్రబాలెంలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో తమ భవిష్యత్తుపై యువత వ్యక్తంచేసిన సందేహాలకు లోకేష్ విస్పష్టమైన సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రానికి పరిశ్రమలు రాబట్టేందుకు తమ వద్ద చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ఆ బ్రాండ్ తోనే గతంలో కియా, టిసిఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతిని పూర్తిచేస్తామని తెలిపారు.
మీ వయసు చాలా తక్కువ..మీ నాన్న 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంతో కొడుకు జగన్..67 కంపెనీలు పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నారు. మీరు కూడా మీ నాన్న 14 ఏళ్ల సీఎం పదవి అండతో 200 కంపెనీలు పెట్టుకుని రూ.3 లక్షలు కోట్లు దోచుకోక పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? అని రాజేష్ ప్రశ్నించారు. నా పాదయాత్ర యువత కోసం చేస్తున్నా. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కిపోతోంది. యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నా. యువత సోషల్ మీడియా పోస్టు పెడితే ఈ ప్రభుత్వం కేసులు పెడుతోంది. 2019 తర్వాత నాపై 20 కేసులు పెట్టారు. రాష్ట్రం కోసం పోరాడుతన్నవారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. యవత గళం..ఈ సైకోకు వినిపిస్తాం.
జగన్ పాదయాత్ర చేశారు..చంద్రబాబు రక్షణ కల్పించారు. విశాఖ ఎయిర్ పోర్టులోకి వెళ్లి కోడికత్తితో పొడిపించుకుని డ్రామా ఆడారు. రాష్ట్రంలోని ఆసుపత్రులపై నమ్మకం లేక హైదరాబాద్ వెళ్లారు. ఈ ప్రభుత్వంలో మీరు రోజూ యుద్ధం చేస్తున్నారు..రాళ్ల, గుడ్లు వేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మీకు ఏరోజైనా భయం వేసిందా అని అడగగా, యం అనే పదం వింటే మామయ్య డైలాగ్ గుర్తుకొస్తోంది..భయం అనే పదం నా బయోడేటాలో లేదు. ఏ తప్పూ చేయని మనం ఎందుకు భయపడాలి.? నేను తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదు. యువత కోసం, ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నా..తగ్గేదే లేదు. యశ్వంత్, పెనుమూడి, దుగ్గిరాల మండలం: నేను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నా..వారు హమారా హైదరాబాద్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మా రాజధాని ఏది అని చెప్పుకోవాలి..మాకేంటి ఈ ఖర్మ అని లోకేష్ అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…