Nara Lokesh : గత కొద్ది రోజులుగా నారా లోకేష్ సైలెంట్‌గా ప్రచారం చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. నారా లోకేష్ మరోసారి యువగళం ప్రచారాన్ని ప్రారంభించారు. బహిరంగసభలకు భిన్నంగా యువతను ఆకట్టుకునేలా ఈ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహిస్తున్నారు..ఒంగోలు, నెల్లూరుల్లో జరిగిన యువగళం ప్రచారానికి యువత పోటెత్తారు. తమ భవిష్యత్ కు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు.. ఎలా ఇస్తారు.. అన్న దానిపై వారికి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం సభలకు యువతీయువకుల్లో అపూర్వస్పందన లభిస్తోంది.
ఇప్పటి వరకు ఒంగోలు, నెల్లూరు, చంద్రగిరి పట్టణాల్లో యువగళం సభలు పూర్తయ్యాయి. 4న రాజంపేట, 5న ఏలూరు, 6న విజయనగరం, 7న శ్రీకాకుళంలో యువగళం సభలు నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. యువత మద్దతు టీడీపీకి పెరిగేలా చేయడంలో నారా లోకేష్ ప్రత్యేకమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రతో గంజాయి బ్యాచ్ మినహా… అభివృద్ధి చెందుదాం అనుకునే ప్రతి ఒక్క యువతీ, యువకుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తించేలా చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ఉద్యోగం, ఉపాధి, శాంతి భద్రతలు సహా .. భవిష్యత్ కోసం ఏం చేయాలని.. ఎంత కష్టపడాలన్నదానిపై ఓ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు.
ఒక సభలో ముస్లిం సోదరి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, టీడీనీ అన్నా ఇష్టం. అయితే మీరిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. విడివిడిగా పోటీ చేస్తే ఓడిపోతారని భయమా అని అడిగింది. దానికి నారా లోకేష్ సాలిడ్ ప్రశ్న వేసావు అని అన్నాడు. పవన్ అన్న మాకు ఎంతో సపోర్ట్ అందించారు. ప్రతిపక్షం ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే మేము కలిసి పని చేస్తున్నాం. మేము జగన్‌కి సైకో అని పేరు పెట్టాం.ఈ సైకో ముఖ్యమంత్రిని కలిసి తరిమికొట్టాలనే ఉద్దేశంతోనే ఇలా నడుస్తున్నాం. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఉద్యోగాలు లేవు,ఉపాధి లేదు. అన్ని చార్జీలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులకి సకాల జీతాలు పెంచడం లేదు. అందరు భాదపడుతున్నారు. కలిసికట్టుగా పోరాడి, మంచి మెజార్టీ సాధించి వైకాపిని భూస్థాపితం చేయాలనే మేము పొత్తు పెట్టుకున్నాం అని లోకేష్ అన్నారు.