Nara Devansh : తిరుపతిలో నారా ఫ్యామిలీ సందడి చేసింది. హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా చూసే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందంటూ విమర్శలు వినిపిస్తున్నసమయంలో తిరుమల లడ్డూల గురించి తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ నాణ్యత పడిపోవడంపై అనేక ఫిర్యాదులు మనం వింటూనే ఉన్నామని ఆయన చెప్పారు. దైవ ప్రసాదం అసలు నాణ్యతను 2024 మార్చి / ఏప్రిల్ లో తాము స్వాధీనం చేసుకున్న తర్వాత పునరుద్ధరిస్తామని తెలిపారు. లడ్డూ నాణ్యతలో తేడాను మీరు గమనిస్తారని అన్నారు.
తిరుపతి రాజకీయ పరిణామాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కుమారుడు దేవషాన్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన నారా లోకేష్‌ను తిరుపతి టిడిపి నాయకులు కలిశారు. అనంతరం టీడీపి కూటమి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు కూడా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి రాజకీయ పరిణామాలపై నాకు పూర్తి సమాచారం ఉందని.. రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. పూర్తిస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌కు సూచించారు.
తిరుపతి జనసేన అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరిన సుగుణమ్మకు నారా లోకేష్ క్లాస్ పీకినట్టు తెలిసింది. తిరుమల దర్శనం కోసం వచ్చిన ఆయనను కలసి తన సేవలు గుర్తించి జనసేన టికెట్టు ఇప్పించాలని కోరిన సమయంలో హిత బోధ చేశారని సమాచారం. తిరుపతి స్థానం జనసేనకు కేటాయించామని, ఆ పార్టీ అభ్యర్థి విషయంలో తాను ఎలా జోక్యం చేసుకుంటానని ప్రశ్నించానని తెలిసింది. రాజకీయాలలో ఇలాంటివి సహజమేనని, పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇక ఇదిలా ఉంటే నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ ప్రసాదం ఎంతో అపురూపంగా తింటుంటూ అది చూసి లోకేష్ షాకయ్యాడు.