Nara Brahmani : సీఎం జ‌గ‌న్ క‌లియుగ రాక్ష‌సుడు.. బ్రాహ్మ‌ణి ట్వీట్ వైర‌ల్‌..!

Nara Brahmani : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత నారా బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి ప్ర‌జ‌ల‌లో తెగ తిరుగుతూ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిసిన విష‌యం తెలిసిందే. నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి ఆయనతో ములాఖత్‌ అయ్యారు. వారితో పాటు పార్టీ నేత మంతెన సత్యనారాయణరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సాధించ‌బోయే విజ‌యానికి సంకేతం విజ‌య‌ద‌శ‌మి సంబ‌రమంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు. చెడుకి పోయేకాలం ద‌గ్గర ప‌డ‌టం ద‌స‌రా సందేశమన్న ఆయన, ప్రజ‌ల్ని అష్టక‌ష్టాలు పెడుతోన్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే పంతంగా అంతా కలిసి పోరాడ‌దామని పిలుపునిచ్చారు.

మరోవైపు రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని, అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లి విరియాలని ఆకాంక్షించారు. ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. సోమవారం రాత్రి 7గంటల నుంచి 5 నిమిషాల పాటు ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరింది.

Nara Brahmani sensational comments on cm ys jagan
Nara Brahmani

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండ‌డం మనం చూస్తున్నాం.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికే ‘ మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’, ‘న్యాయానికి సంకెళ్లు’ వంటి కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు నిర్వహించారు. తాజాగా ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో సోమవారం రాత్రి ఐదు నిమిషాలు తమ నిరసన తెలపనున్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ‘సైకో పోవాలి’ అని రాసిన పత్రాలను దహనం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణి ఆసక్తికర ట్వీట్ చేశారు. . దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం! అంటూ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేసింది. ‘దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం’ అంటూ రాసిఉంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 months ago