Nara Brahmani : బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈవిడ ఎన్నికల ప్రచారాలలో చాలా యాక్టివ్‌గా కనిపించింది. చంద్రబాబు తరపున, లోకేష్ తరపున, బాలయ్య తరపున కూడా ప్రచారం చేసింది. రీసెంట్‌గా తన తండ్రికి సంబంధించి ట్వీట్ కూడా చేసింది బ్రాహ్మణి. నాన్న నువ్వెప్పుడూ ప్రజల హీరోవి.. వారిని సంతోషంగా ఉంచడానికే నిత్యం శ్రమిస్తావంటూ నారా బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న వీడియోను జతచేశారు. అలాగే తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన నారా లోకేష్‌కు సైతం బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉద్విగ్న భరిత క్షణాలను మాకు సొంతం చేసిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలంటూ మరో ట్వీట్ చేశారు.
ఇక నారా బ్రాహ్మణికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె వాలీబాల్ ఆడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ ప్యారడైజ్ అపార్టుమెంటు వాసులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. నారా బ్రాహ్మణి క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడి అలరించారు. అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు.
అయితే నారా బ్రాహ్మణి అంత అద్భుతంగా వాలీబాల్, క్రికెట్ ఆడడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మధ్య నారా బ్రాహ్మణి, రామ్ చరణ్‌కి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న సమయంలో రాంచరణ్ పక్కనే ఉన్న నారా బ్రాహ్మణి ఆయనతో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి నారా లోకేష్ ను వివాహం చేసుకున్నారు వీరికి దేవాన్ష్ అనే సంతానం ఉన్నారు. తన తండ్రి, భర్త, మామ అందరూ రాజకీయాల్లోనే ఉన్న బ్రాహ్మణి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆమె చూసుకుంటున్నారు. ఎక్కువగా ఆమె బిజినెస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…