Nandamuri Chaitanya Krishna : నందమూరి యువ హీరో చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. బ్రీత్‌కు ముందు ధమ్‌తో పాటు కొన్ని సినిమాల్లో చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ముఖ్యమంత్రిని చంపాలని ప్రయత్నించే ఓ యువకుడి కథతో ఇంట్రెస్టింగ్ కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ సోదరుడు అయిన నందమూరి జయకృష్ణ తనయుడే చైతన్య కృష్ణ. మూవీ ప్రమోషన్‌లో భాగంగా చైతన్య కృష్ణ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నాడు.
తాతగారు మా నాన్నకి ప్రాపర్టీస్ ఎక్కువగా అప్పగించారు. తాతగారు అప్పట్లో శంషాబాద్‌లో 250 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. అది ఎవరికి తెలియదు. డాడీకి అంతా ఎగ్జిక్యూషన్ చేశారు. ఫాం కోసమే తీసుకున్నారు. అది మొత్తం డాడీనే చూసుకునేవాళ్లు. ఫ్యామిలీతో పాటు బిజినెస్‌తో బిజీగా ఉండడం వల్లనే డాడీకి లో ప్రొఫైల్ గా ఉంటారు అని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చాడు. ఇక టీడీపీ-జనసేన పొత్తుపై స్పందించారు. పొత్తుపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైతన్య కృష్ణ స్పందిస్తూ.. ‘‘ టీడీపీకి సొంత క్యాడర్ ఉందండి. సొంతంగా వెళ్లినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా కలిస్తే.. పొత్తు పెట్టుకుంటాం. వాళ్లకు కొన్ని సీట్లు ఇస్తాం. టీడీపీ సపోర్టు చేస్తానని పవన్ కల్యాణ్ గారు ముందుకు వచ్చారు’’ అని అన్నారు.
నాన్నగారు మంచి కథతో సినిమా చేయమని చెప్పారు. మంచి కథల కోసం చూస్తున్న సమయంలో దర్శకుడు వంశీకృష్ణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ఇది. వంశీ అద్భుతమైన కాన్సెప్ట్‌తో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఈ సినిమాని తీర్చిదిద్దారు. భవిష్యత్‌లో మేము మళ్ళీ కలిసి పని చేస్తాం. మా బాబాయ్ బాలకృష్ణగారు, బి గోపాల్‌గారు, కోడిరామకృష్ణ గార్ల కాంబినేషన్ ఎలా అయితే హిట్ కాంబినేషన్‌గా నిలిచిందో.. మాది కూడా తప్పకుండా హిట్ కాంబినేషన్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నగారికి ధన్యవాదాలు అని అన్నారు చైతన్య కృష్ణ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…