Nagarjuna : ఈ దసరాకి బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగనుందనే విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్, గణేష్ స్వాతిముత్యం సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగార్జున కూడా ఘోస్ట్ మూవీపై హోప్స్ చాలా పెట్టుకున్నాడు. రాజశేఖర్‌తో పీఎస్‌వీ గరుడవేగ లాంటి స్పై యాక్షన్ డ్రామాను రూపొందించిన ప్రవీణ్‌తో నాగార్జున సినిమా చేస్తున్నారు అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో నాగార్జున ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ది ఘోస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఘోస్ట్ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నాగార్జున యాక్టివ్‌గా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో నాగార్జునకు పాత్రికేయులు రకరకాల ప్రశ్నలు సంధించారు. అయితే ఓ జర్నలిస్ట్ నాగార్జునను నాటీ క్వశ్చన్ అడిగారు. స్క్రీన్ మీద మీకు గర్ల్స్‌తో రొమాన్స్ ఎక్కువ ఇష్టమా ?.. గన్‌తో ఫైరింగ్ ఇష్టమా ? అని ప్రశ్నించారు. దీనికి నాగార్జున నవ్వుతూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఒక చేతిలో గన్ను.. ఇంకో చేతిలో అమ్మాయి.. అని నాగార్జున సమాధానం చెప్పగానే అందరూ కేకలు వేశారు.
![Nagarjuna : ఒక చేతిలో అమ్మాయి ఇంకో చేతిలో అది.. అంటూ అందరి ముందు అలా అనేశాడేంటి..? Nagarjuna interesting comments video viral on his movie](http://3.0.182.119/wp-content/uploads/2022/10/nagarjuna.jpg)
ఇక ఇప్పటి వరకు వచ్చిన విజువల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. సినిమాను ఇప్పటికే తామంతా చూశామని.. అందుకే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని వెల్లడించారు నాగార్జున. తమ సినిమాలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల పాత్రలు చేసిన వారు ఉన్నారని.. ఈ విషయంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు చాలా జాగ్రత్త తీసుకొని కాస్టింగ్ చేసుకోవడమే కాకుండా వాళ్ల నుంచి మంచి ఔట్ పుట్ కూడా రాబట్టాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
.@iamnagarjuna funny reply to media question 😂🤣#TheGhostOnOct5 pic.twitter.com/UNX8gPP0aC
— Rajesh Manne (@rajeshmanne1) September 30, 2022