Nagarjuna : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కొద్ది రోజుల కిందట మొదలైన విషయం తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లో అడుగుపెట్టగా వారు తెగ సందడి చేయనున్నారు .ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7ను హుషారుగా మొదలు పెట్టారు కింగ్ నాగార్జున. ఇక ఈ సీజన్ లో ఇప్పటికే 14 మంచి కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు నాగార్జున. హౌస్ లోకి వెళ్లిన వారిలో కిరణ్ రాథోడ్, శుభ శ్రీ, శోభా శెట్టి, రతిక, ఆట సందీప్, అమర్ దీప్ , గౌతమ్ కృష్ణ, షకీలా, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, హీరో శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. యూట్యూబర్ గా పల్లవి ప్రశాంత్ పాపులర్. ఆయన సోషల్ మీడియా వేదికగా తాను రైతు బిడ్డనని, బిగ్ బాస్ కు వెళ్లడం తన కల అంటూ చెప్తూ ఉన్నాడు.
ఇన్ స్టా గ్రామ్ లో బిగ్ బాస్ కు వెళ్లేందుకు సపోర్ట్ చేయాలనీ చాలా కాలం నుంచి అందరిని అభ్యర్ధిస్తున్నాడు. ఎట్టకేలకి అతని కల నెరవేరింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తూనే ఓ బియ్యం మూటతో వచ్చి అవి తాను పండించిన బియ్యం అని తెలిపాడు. అవి నాగ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ప్రశాంత్‌కి నాగార్జున కూడా ఓ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ పచ్చిమిర్చి మొక్కను ప్రశాంత్ చేతికి ఇచ్చి.. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇది వాడిపోతే మాత్రం నీకు పనిష్మెంట్ ఇస్తానని, దీనికి మిర్చి పండితే మాత్రం ఓ మంచి బంపరాఫర్ ఇస్తానంటూ నాగ్ చెప్పారు. దీంతో కచ్చితంగా దీన్ని కాపాడుకుంటానంటూ మొక్క పట్టుకొని హౌస్‌లోకి వెళ్లిపోయాడు ప్రశాంత్.
బిగ్ బాస్ కి వెళ్తానంటే అప్పుడు చాలా మంది తనని దారుణంగా విమర్శించారని, ఇప్పుడు తన కల నెరవేర్చుకున్నట్టు స్పష్టం చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ వారానికి లక్ష రూపాయలు ఉందంట. ఆయన ఎన్ని వారాలు హౌస్ లో ఉంటే అన్ని లక్షలు వస్తాయన్నమాట. మరి పల్లవి ప్రశాంత్ ఎన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతాడో చూడాలి. కాగా,ఊరిలో పొలం పనులు చేస్తూ తాను రైతు బిడ్డను అన్నా.. నాకు బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పించండి అంటూ చాలా వీడియోలు చేశాడు ప్రశాంత్. కన్నీళ్లు పెట్టుకొని మరీ దయచేసి బిగ్‌బాస్ అవకాశం ఇప్పించండి నాగార్జున గారు అంటూ ప్రాధేయపడేవాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…