Nagarjuna And Anushka Shetty : టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలలో నాగార్జున, అనుష్క జోడి ఒకటి. నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి దాదాపు అర డజనుకు పైగా సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఓ చిత్రంలో హీరో, హీరోయిన్‌గా నటించకపోవడం విశేషం. కొంత మందిని హీరో, హీరోయిన్లను వెండితెరపై చూస్తే రెండు కళ్లు చాలవు. అలాంటి జోడిల్లో నాగార్జున, అనుష్కది డిపరెంట్ అని చెప్పాలి. నాగ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క.. ఈయనతోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. అనుష్క ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మను స్వీటీ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అయితే ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంతే స్వీట్‌గా ఉంటుందని చాలామందికి తెలియదు.
తాజాగా ఆమె వద్ద పనిచేసిన మేకప్ మ్యాన్ చంద్ర అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్‌ను రివీల్ చేశాడు. అతను అనుష్క మొదటి మూడు సినిమాలకు మేకప్ మ్యాన్ గా వ్యవహరించాడు. తర్వాత అనుష్కతో పంచాక్షరి సినిమాను ప్రొడ్యూసర్గా తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. దీంతో భారీ లాభాలు అర్జించాడు చంద్ర. యోగ టీచర్గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వీటీ.. నాగార్జున నటించిన సూపర్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకొని నటనలో తన సత్తా చాటుకుంది.తాజాగా అనుష్క గురించి మేకప్‌మెన్ చంద్ర రామచంద్రరావు ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క చాలా సెన్సిటివ్ అని.. తన ముందు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా చాలా బాధపడుతుందని..అన్నాడు.
మంచి దయా గుణం అని ఇతర ఏ హీరోయిన్లలోనూ అలాంటి క్వాలిటీ చూడలేదన్నారు. ఏదో మోహమాటంతో చేయడం కాదు, హార్ట్ తో చేస్తుంది. అలానే ఫీలవుతుంది. చాలా జెన్యూన్ పర్సన్ అని చెప్పాడు. ఏ విషయంలోనూ, మనీ విషయంలోనూ ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టదన్నారు. అనుష్క మన ఇండస్ట్రీకి చాలా స్పెషల్ అని, ఆమె దొరకడం మన అదృష్టం అని చెప్పారు. ఇలాంటి అమ్మాయి దొరకదని, మరో పదేళ్లలో కూడా ఇలాంటి హీరోయిన్ దొరకదన్నారు. అంత మంచితనం మిస్ యూజ్ చేసేవాళ్ల ఉంటారు కదా అనే ప్రశ్నకి స్పందిస్తూ, ఆమెని ఎవరూ మిస్ యూజ్ చేయలేరని తెలిపారు సీనియర్ మేకప్‌మెన్.
అనుష్క ఒక మనిషిని అలా చూడగానే అతని క్యారెక్టర్ ఏంటో కనిపెడుతుందని, అంత పిచ్చిది కాదు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. అందుకే ఆమెని ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పుకొచ్చాడు మేకప్‌మెన్ చంద్ర. ఆమె ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందని, మెసెజ్ చేస్తే రియాక్ట్ అవుతుంది. ఫోన్‌లోనూ మాట్లాడుతుందని అన్నాడు. ఇటీవల ఆమెకి చాలా సార్లు ఫోన్లు చేశానని, కానీ లిఫ్ట్ చేయడం లేదని, మెసేజ్ చేసినా రియాక్ట్ కావడం లేదని తెలిపారు. మరి ఎందుకు అలా చేస్తుందో అర్థం కావడం లేదని, తమ మధ్య మాత్రం ఎలాంటి గొడవ లేదని స్పష్టం చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…