వైఎస్ జగన్ ఇటీవల మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో పర్యటించిన విషయం తెలిసిందే. విద్యా దీవెన నిధులను విడుదల చేశారు.నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11300 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 84 వేల మంది తల్లుల ఖాతాల్లో 680 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 28 ఏళ్ల క్రితమే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా అని జగన్ ప్రశ్నించారు. సొంత కొడుకు పైనే నమ్మకం నమ్మకం లేదని అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు మోసాలతోనే నిలిచిందని జగన్ అన్నారు. రెచ్చగొట్టి శవరాజకీయాలు చేయాలనేదే చంద్రబాబు ఉద్దేశమని సీఎం వ్యాఖ్యానించారు పోలీసులపై పుంగనూరులో రాళ్లు కర్రలు బీరు సీసాలతో దాడి చేయించారని ఆరోపించారు. ఇక కార్య్కక్రమంలో మంత్రిరోజాతో పాటు మరో వర్గానికి చెందిన కేజే శాంతి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళానేతల మధ్య సయోధ్యకు జగన్ ప్రయత్నించారు. సభావేదిక వద్ద సీఎం జగన్, మంత్రి రోజా, కేజే శాంతిల చేతులు కలిపి కలిసి మెలిసి ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చేతులు కలిపేందుకు ఇద్దరు మహిళా నేతలు అయిష్టత వ్యక్తం చేశారు. కలిపినట్లే కలిపి ఇద్దరూ తమ చేతులను వెనక్కి తీసుకున్నారు.
నగరి పర్యటనలో అక్కడి ప్రజలు జగన్ పై పూల వర్షం కురిపించారు. అక్కడి ప్రజలు సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టారు. నగరి పర్యటనలో ఉన్న సీఎంకు.. అక్కడి ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనకు పూలు చల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ప్రజలు సీఎం జగన్ పై పూల వర్షం కురిపించారు. ఆయన రాకతో ఆ ప్రాంతమంతా జై జగన్ అంటూ మారుమోగింది. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ.. సీఎం జగన్ ముందుకు సాగారు. గతంలో కోనసీమ పర్యటన సమయంలోను జగన్‌పై ఇలానే అక్కడి ప్రజలు పూల వర్షం కురిపించడం మనం చూశాం.