Nagachaitanya : 75 ఏళ్లు సినీ కళామ్మ తల్లికి సేవలందించిన నాగేశ్వరావు తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. సెప్టెంబర్ 20న అక్కినేని శతజయంతి సందర్భంగా ఆయనను తలుచుకుంటూ.. ఆయనకు నివాళులు అర్పిస్తూ సినీ తారలు, అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లి పెడుతున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరావు విగ్రహాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. మహానటుడి శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
మహేష్ బాబు, రామ్ చరణ్ , నాని, నాగ చైతన్య, అఖిల్ వంటి హీరోలు వచ్చారు. సీనియర్ నటుల్లో మోహన్ బాబు , జయసుధ, బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ వేదికపై ప్రతి ఒక్కరూ కూడా నాగేశ్వర రావు గొప్పతనాన్ని వివరించగా.. ఆయన మనవడు నాగ చైతన్య కాస్త ఎమోషనల్ అవుతూ స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో మీరంతా పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏఎన్నార్ గారు అంటే అందరికీ తెలుగు ఇందస్ట్రీ పెద్దగా, గొప్ప నటుడిగా, క్లాసిక్ ఐకానిక్ గా పరిచయం. ఆయన చేసిన చిత్రాలు, కొత్త జానర్లలో బోలెడన్ని రిస్కులు చేశారు. ఇప్పటికీ ఫిల్మ్ స్కూల్ ఏఎన్నార్ ను ఇన్పైరింగ్ కేస్ స్టడీగా చదువుతుంటారు. నేను కూడా ఆ లిస్టులో ఒకడిని.
‘మనం’ సినిమా తాత గారితో కలిసి చేయడం నా అదృష్టం. అది నా లైఫ్ లో, కెరీర్ లో హైపాయింట్. జీవితంలో కలలు కనడానికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన జర్నీ చెబుతుంది. ఆయన ఎప్పుడూ నాలో దీపంలా వెలుగుతూనే ఉంటారు. మనం ఎక్కడ పుడుతామో.. ఎవరి పుడుతామో మన చేతిలో ఉండదు. అక్కినేని నాగేశ్వర్ రావు గారి మనవడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన లెగసీ అదే స్థాయిలో కొనసాగుతుంది. ఆయన మనలోనే జీవించి ఉన్నారు. ఈ వేడుకకు వచ్చిన అక్కినేని అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు. ఇక నాగార్జున మాట్లాడుతూ… నాన్న మాకు ఎంతో ప్రేమను అందించారు. బాధేసిన, సంతోషం వేసిన నాన దగ్గరికి వెళ్లి పంచుకునే వాళ్ళం అని అన్నారు. నాన్నకు అన్నపూర్ణ స్టూడియో అంటే మహా ఇష్టం. నాన్నకు ఇష్టమైన అన్నపూర్ణ స్టూడియోలో విగ్రహం పెట్టాం అని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…