Nagababu : ఏపీ ఎన్నికలు ఈ సారి మంచి రంజుగా సాగాయి. ప్రచారంలో చాలా మంది ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కొందరు తమకి నచ్చిన వారికి మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో మొదలైన రగడ నాగబాబు ట్వీట్‌తో మరింత వేడెక్కింది. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది.కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలని తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అల్లు అర్జున్ నంధ్యాల పర్యటన వివాదం కూడా యింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు, అక్కడ అల్లు అర్జున్ ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచినందువలన శాంతి భద్రలకు ఆటంకం కలిగింది అని అల్లు అర్జున్ పై ఒక కేసు కూడా నమోదైంది.
మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గత కొంతకాలంగా ఎక్కడోచోట వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల నడుమ తాజా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడిచింది.
నష్టనివారణలో భాగంగానే అల్లు అర్జున్ సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చాడు. ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఓటు వేసిన తర్వాత ”నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీలు ఒక్కటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మావయ్య పవన్‌కల్యాణ్‌కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపాను. భవిష్యత్‌లో తన మావయ్య చంద్రశేఖర్, బన్నీ వాస్ వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులెవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తానని ప్రకటించారు.అయితే ఇదే సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. , “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!,” అని పోస్ట్ చేశారు. ఇందులో ఎవరి పేరు చెప్పకపోయినా, ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నట్టుగానే వుంది అని నెటిజన్స్ అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…