Naga Chaitanya : నాగ చైతన్య, సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసంర లేదు. ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకొని 2021 అక్టోబర్ 2న కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు .టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం పట్ల చాలా మంది సినీ అభిమానులు బాధపడ్డారు. నాగ చైతన్యతో విడిపోయాక సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లోని చైతన్య ఫోటోలు అన్నింటినీ డెలీట్ చేసింది.
అయితే, నాగా చైతన్య మాత్రం పాత ఫోటోలను అలాగే ఉంచాడు. ఆ మధ్య సమంత ఓ షోలో ఇద్దరిని ఒకే రూంలో బంధిస్తే కత్తులతో పొడుకుంటాం అన్నట్టు మాట్లాడింది. దీంతో చైతూ మీద సమంతకి అంత కోపం ఉందా అని అందరు అనుకున్నారు. అయితే చైతూ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ‘కస్టడీ’ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చై.. ఎక్స్ వైఫ్ సమంత గురించి పాజిటివ్‌గా మాట్లాడి తన మంచి మనసు చాటుకున్నాడు. తామిద్దరూ విడిపోయి రెండేళ్లు అయ్యిందని, అలాగే లీగల్‌గా డివోర్స్ తీసుకుని ఏడాదైందన్న నాగ చైతన్య.. ఇప్పుడు ఎవరి లైఫ్‌లో వాళ్లం బిజీగా ఉన్నామని చెప్పాడు.
అంతేకాదు జీవితంలో దాటొచ్చిన ప్రతి ఫేజ్‌ను తాను గౌరవిస్తానని వెల్లడించాడు. సమంత మంచి హ్యూమన్ బీయింగ్ అని, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అసలు మేం విడిపోవడానికి కారణం పుకార్లే. సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు, మీడియాలో వచ్చిన కొన్ని వార్తల కారణంగానే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మొదట్లో ఆ రూమర్లను పట్టించుకోలేదు. కానీ తర్వాత పెద్దా మారాయి. అవి కాస్తా డివోర్స్ దాకా వెళ్లాయి అంటూ తొలిసారి స్పందించారు. ఇక సంబంధంలేని థర్డ్ పర్సన్‌ను ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వారిపైనా నెగెటివిటీ స్పెడ్ అవుతోందన్నారు. ఇప్పటికీ మా విడాకుల ప్రశ్నలు ఎందుకు అడుగుతూ రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు చై.