Naga Babu : మరికొద్ది గంటలలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది అనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఓటమి భయంతో వైఎస్సార్సీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు చేసేటటువంటి కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని ఆయన అన్నారు.
మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని నాగబాబు పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ రోజు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని ఆయన పార్టీ నేతలను కోరారు. ‘ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది’ అన్నట్టు మనమంతా సంయమనం పాటించి ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని నాగబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఓడిపోతాం అనే భయంతో వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని ప్రజా ప్రభుత్వమే ఏర్పడబోతోందని ఎక్స్ వేదికగా నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.

ఇక ఈ కామెంట్స్ తర్వాత నాగబాబు మరో వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యకర్తలని రెచ్చగొడుతున్నారని, అది తప్పు అంటూ నాగబాబు అన్నారు. ప్రజలందరు సంయమనంతో ఉండాలంటూ కూడా నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ సారి కూటమి అధికారం ఖాయం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయాన్ని గౌరవించాలని కూడా ఆయన చెప్పారు. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి పోలీసులు, ఈసీకి సహకరిద్దామని నాగబాబు అన్నారు. పోలీసులు, ఈసీకి సహకరిద్దాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడదామంటూ నాగబాబు పిలుపునిచ్చారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే, ఓడిపోయే వాళ్లు చేసే కవ్వింపు చర్యలకు, అల్లర్లకు ప్రతిస్పందించవద్దన్నారు.