Nadendla Manohar : తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా మంచి సక్సెస్ తో సాగుతున్న సమయంలో 2014 మార్చిలో ‘జనసేన’ పార్టీ స్థాపించాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లో వైసీపీపై సంచనల ఆరోపణలు చేసి వార్తలలో నిలిచారు. ఇక శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి ధర్నా చేస్తున్న సమయంలో సీఐ అంజూ యాదవ్ అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
తిరుపతికి వెళలి సీఐ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రేణిగుంటకు చేరుకొని అక్కడ నుంచి జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా జిల్లా ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్ట్‌లో పెద్ద హైడ్రామా నెలకొంది. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. ఇక పోలీసులు పవన్ కళ్యాణ్‌ని కారు దిగనివ్వకుండా కొంత సేపు అడ్డుపడ్డట్టు తెలుస్తుంది. ఆ సమయంలో మనోహర్ కారు నుండి దిగి, పోలీసులపై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ ఆఫీసుకు చేరుకున్న సమయంలో ఓ విచిత్ర దృశ్యం చోటుచేసుకుంది. ఇలా కూడా శాలువా కప్పుతారా అని ఆశ్చర్యపరిచే రీతిలో… ఓ అభిమాని క్రేన్ కు వేలాడుతూ వచ్చి కారులో నిలుచుని ఉన్న పవన్ కు శాలువా కప్పి, పూల దండ వేసి సత్కరించాడు. అభిమాని సాహసం చూసిన పవన్ కూడా కాస్త విస్మయానికి గురయ్యారు. అదే సమయంలో, ఆ అభిమాని వేలాడిన తీరుకు ఆయన నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ అభిమానిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.