Muttiah Muralitharan : క్రికెట్ మైదానంలో బంతితో బ్యాట్స్‌మెన్లను గడగడలాడించిన స్టార్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన టెస్ట్ క్రికెట్‌లో ఎవరూ అందుకోలేని విధంగా 800 వికెట్ల తీసి చరిత్ర సృష్టించాడు. అలాంటి గొప్ప స్పిన్నర్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ 800 మూవీ అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ అయింది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది.
చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మురళీధరణ్, లక్ష్మణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధరన్‍కు ఓ ప్రశ్న ఎదురైంది. భారత్‍లో వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలతో ఓ క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఎవరిని తీసుకుంటారని మురళీని ప్రశ్నించారు హోస్ట్. అలా.. సెలెబ్రిటీలతో టీమ్ ఎంపిక చేయాల్సి వస్తే.. తాను టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‍ను కెప్టెన్‍గా తీసుకుంటానని మురళీధరన్ అన్నారు. “వెంకటేశ్‍ను కెప్టెన్‍గా తీసుకుంటా. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎస్ఆర్‌హెచ్ (ఐపీఎల్) మ్యాచ్‍ను ఆయన అసలు మిస్ అవరు. నిజమైన సపోర్టర్. అందుకే ఆయన తొలి ఎంపిక” అని మురళీధరన్ చెప్పారు.
రాజకీయ నాయకులంటే తనకు తెలియదని, తనకు తెలిసిన మరికొందరి యాక్టర్స్ పేరు చెబుతానని మురళీధరన్ అన్నారు. సెలెబ్రెటీలతో క్రికెట్ జట్టు ఏర్పాటు చేయాల్సి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, నాని, ప్రభాస్‍లను జట్టులోకి తీసుకుంటానని చెప్పుకొచ్చారు. తనకు సినిమాలంటే ఇష్టమని అందుకే ఇతర పెద్ద స్టార్లను కూడా జట్టులోకి తీసుకుంటానని అన్నారు. నాని చేసిన గొప్ప సినిమా జెర్సీని చూశానని, అతడితో ఫోన్‍లో మాట్లాడానని ముత్తయ్య మురళీధరన్ అన్నారు. నాని సినిమాలు తనకు నచ్చుతాయని చెప్పారు. మొత్తానిక తెలుగు నటుల పేర్లు ముత్తయ్య మురళీధరన్ నోట రావడంతో వారి వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.
https://youtube.com/watch?v=ymAzWMdzxzo