Mrunal Thakur : సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈ ముద్దుగుమ్మ అలరిస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. . వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించగా.. శ్రుతి హాసన్ స్పెషల్ అప్పిరీయెన్స్ ఇచ్చింది. మోహన్ చెరుకూరి , డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘హాయ్ నాన్న’ గురించి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది మృణాల్. అంతే కాకుండా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి షేర్ చేసుకుంది. అప్పుడు సీతగా ఎంత ఆదరించారో.. ఇప్పుడు యశ్నగా కూడా అంతే ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పింది. తెలుగమ్మాయిగా తనను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ‘హాయ్ నాన్న’ సినిమా వల్ల తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అని, తను మరెవరో కాదు అంటూ చైల్డ్ ఆర్టిస్ట్ కియారా పేరు చెప్పింది. తను అతిపెద్ద సూపర్ స్టార్ అని, చాలా మైమరిపించే పర్ఫార్మెన్స్ ఇచ్చిందని కియారాను ప్రశంసల్లో ముంచేసింది మృణాల్.
ఇక మంచి కో స్టార్‌గా ఉన్నందుకు నానికి థ్యాంక్స్ చెప్పింది. చాలా సాయంగా నిలబడ్డాడంది. యశ్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే అందులో నాని పాత్ర కూడా ఉంటుంది అని తెలిపింది. తన సహ నటుల వల్ల తను చాలా ఎంజాయ్ చేశానంది మృణాల్. ఊటీ, గోవా, హైదరాబాద్‌లలో షూటింగ్ జరిగిందని, షూట్ అంతా చాలా ఫన్‌గా సాగిందని బయటపెట్టింది. సమయమా, అమ్మాడి పాటలు నా ఫేవరేట్. ఇందులో తండ్రికూతురు అనుబంధం అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నపుడు వారితో ప్రేమలో పడిపోతారు. అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…