MP Navneet Kaur : వెండి తెరపై తన లేలేత అందాలను పదర్శించి టాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది నవనీత్ కౌర్. తన అందంతో పాటు అభినయంతో జనాలను ఆకట్టుకుంది.కొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. తొలుత మళయాళం మూవీ వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్యానుంసలో నటించి వెండి తెరకు పరిచయం అయ్యింది. అదే సినిమాని తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మీ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.నిజానికి నవనీత్ కౌర్ శత్రువు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి ఎంపీగా విజయం సాధించారు.అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జయకేతనం ఎగుర వేశారు.
లోక్ సభలో సైతం పలు సమస్యలపై గళం ఎత్తుతున్నారు నవనీత్ కౌర్.కొత్త సభ్యురాలు అయినా.తన వాక్చాతుర్యం పట్ల సీనియర్ సభ్యులు అబ్బుర పడుతున్నారు.తన నియోజకవర్గ సమస్యలతో పాటు జాతీయ సమస్యలపైనా తను స్పందిస్తున్నారు. నా ఫస్ట్ మూవీ రాజమండ్రిలో షూట్ చేశాను. గోదావరి, కృష్ణ.. ఫైనల్ బజర్‌లో అనౌన్స్ చేసినప్పుడు నా హృదయం పులకరించిపోయింది. నా కర్మ భూమి మహారాష్ట్ర అయిన కూడా నాకు గోదావరి ప్రాంతం అంటే ప్రాణం అంటూ తెలుగు వాళ్లపై, తెలుగు గడ్డపై ప్రేమని కురిపించింది నవనీత్ కౌర్.
లోక్ సభలో అచ్చ తెలుగులో మాట్లాడి తెలుగుని అవమానించిన వారికి గట్టిగా ఇచ్చి పడేసింది. మళయాళం ఇండస్ట్రీతో సినిమాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. ఆ తరువాత తెలుగు సినిమాలతో బీజీ అయ్యారు. మహారాష్ట్రకు చెందిన రవి రానా అనే ఎన్సీపీ నేతను పెళ్లి చేసుకోవడంతో ఆమె నవనీత్ రానా అయ్యారు. 2014 లోనే మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆమె.. 2019 లో అదే స్థానం నుంచి అదే ఎంపీని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓడించి లోక్ సభలో అడుగుపెట్టారు.