MP Gorantla Madhav : లోక్‌సభలోకి ఆగంతకులు చొరబడిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో మనం చూశాం. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాగా భావించే పార్లమెంట్‌లోకి ఆగంతకుల చొరబాటు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. విజిటర్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన దుండగులు స్పీకర్ కూర్చున్న వెల్ వైపుగా దూసుకెళ్లారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన కొంతమంది ఎంపీలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, మరికొందరు ఎంపీలు దుండగులను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా తెలివిగా వ్యవహరించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి దుండగులను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
ఘటన జరిగిన సమయంలో సభలోనే ఉన్న వైసీపీ ఎంపీ, హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దుండగుణ్ని అదుపులోకి తీసుకున్న గోరంట్ల మాధవ్ చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో.. గోరంట్ల మాధవ్‌ను సహచర ఎంపీలు అభినందించారు. ఈ ఘటనపై జాతీయ మీడియా పలువురు ఎంపీ నుంచి వివరణ తీసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏఎన్ఐతో మాట్లాడారు. రిపోర్టర్ ఇంగ్లీష్, హిందీలో ప్రశ్నలు అడగ్గా.. ఘటనను వివరించేందుకు మాధవ్ ఇబ్బంది పడ్డారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్, పంచులు పేలుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
వీడియో చివరలో ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ మరింత ఫన్నీగా మారింది. ఇదిలా ఉంటే గోరంట్ల బిల్డప్ ఇచ్చాడే తప్ప అక్కడ పెద్దగా ఏం చేసింది లేదని కొందరు అంటున్నారు. దుండగుడు సాగర్ శర్మని కాంగ్రెస్ ఎంపీలు పట్టుకుని కొడుతున్న సమయంలో ఎక్కడో నాలుగు బెంచీలు అవతల ఉన్న గోరంట్ల మాధవ్.. తాను కూడా ఓ దెబ్బ వేయాలని.. బెంచీలు దూకి మరీ వచ్చారు. అందరూ పట్టుకుని కొడుతూంటే తాను ఓ దెబ్బ వేసి.. హీరోలా ఫీలయ్యాడు. ఆ దృశ్యాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అసలు బయట గోరంట్ల మాధవ్ చేసుకున్న ప్రచారం ఏంటి.. లోపల జరిగిదేమిటి అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. అయినా మాధవ్ మాత్రం… కాలర్ ఎగరేసుకుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…