MP Galla Jayadev : లోక్ స‌భ‌లో ఎంపీ గల్లా జ‌య‌దేవ్ చివ‌రి స్పీచ్.. ప్రభుత్వాల వేధింపులతోనే రాజకీయాలకు బ్రేక్

MP Galla Jayadev : ఎంపీ గల్లా జ‌య‌దేవ్ గ‌త కొన్నాళ్లుగా రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. అద్భుత‌మైన స్పీచ్‌తో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌తో అంద‌రి నోళ్ల‌లో నానుతున్నారు. ఇటీవ‌ల తాను రాజ‌కీయాల నుండి త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాను లోక్ సభలో తన చివరి ప్రసంగం చేశారు. వ్యాపార కారణాలు, కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు సృష్టించిన ఇబ్బందులతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని తెలిపారు. ప్రజా జీవితంలో ఉండడంతో పాటు వ్యాపారవేత్తగా కొనసాగడం అంత సులభం కాదన్నారు. రెండు పడవల్లో ప్రయాణించడం మంచిది కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నా రాజకీయ జీవితానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని లోక్ సభలో గల్లా జయదేవ్ అన్నారు.

రాజకీయాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ దేశానికి సేవ చేయాలనే తన నిబద్ధత, సంకల్పం స్థిరంగా ఉందని, పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలు చేయడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, దేశానికి ఆదాయం, సంపదను సృష్టించడం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడతానని ఆయన పేర్కొన్నారు. తన కంపెనీలు సుమారు 17,000 మందికి ఉపాధి కల్పించాయి. వారి కుటుంబ సభ్యుల కోసం అనేక సంక్షేమ చర్యలు చేపడుతున్నాయని గల్లా చెప్పారు. వ్యాపార వేత్తలు ఎంతో మంది చట్టసభలకు ఎన్నికవుతున్నారన్నారు. వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు సరికాదన్నారు.

MP Galla Jayadev sensational comments about his life
MP Galla Jayadev

గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2018లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై రెండుసార్లు ఆవేశపూరిత ప్రసంగాల చేసిన తర్వాత గల్లా పేరు మారుమోగింది. ఈ ప్రసంగాల్లో గల్లా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే, ఇవాళ తన చివరి ప్రసంగంలో గల్లా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను, ముఖ్యంగా రామమందిర స్థాపనపై మాట్లాడుతూ.. హిందువుల 500 ఏళ్ల కలను సాకారం చేశారని పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని కోరారు. ఏపీలో దొంగ ఓట్ల(Fake Votes) వ్యవహారంపై ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనపై టీడీపీ అసంతృప్తిని గల్లా మరోసారి నొక్కిచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదా అన్ని సౌకర్యాలు, ఆర్థిక, ఇతరత్రా అంశాలను విస్తరించాలని ప్రధానిని కోరుతున్నానన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago