Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్షకులకి మంచి ఆసక్తిని కలిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మజాతో పాటు ఇంట్రెస్ట్‌ని కలిగిస్తాయి. వాటిలో ఖైదీ చిత్రం ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ లో ఈ ఖైదీ మూవీకి, కార్తీ చేసిన ఢిల్లీ అనే పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లోకీ యూనివర్స్ మొత్తం ఈ ఢిల్లీ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఖైదీ సినిమాలో ఢిల్లీ కూతురిగా అముదా పాత్రలో నటించిన బేబీ మోనికా గుర్తుందా? నిజానికి ఖైదీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి పాత్ర చేసిన అముదా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది.
ఖైదీ సినిమా చూసిన వాళ్లందరికీ ఢిల్లీ పాత్ర ఎంత పవర్ ఫుల్ అనే విషయం గుర్తుండి ఉంటుంది. ఒక హత్య కేసులో ఢిల్లీ జైలుకు వెళ్తాడు. అతని భార్య చనిపోతుంది. తనకు ఉన్న ఒకే ఒక్క కుమార్తె సంరక్షణా నిలయంలో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. తన తండ్రి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అలాగే తన కుమార్తెను మొట్ట మొదటిసారి చూసేందుకు వెళ్తున్న ఢిల్లీకి దారిలో లేనిపోని తలనొప్పి వచ్చి తగులుకుంటుంది. ఆ తర్వాత ఢిల్లీ ఆ అమ్మాయిని కలుసుకుని దూరంగా వెళ్కోలిపోతాడు. అక్కడితోనే ఆ కథను ముంగిచేశారు. కానీ, పార్ట్ 2 కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతను జైలుకు ఎందుకు వెళ్లాడు? ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి.
కార్తీ కూతురుగా నటించిన చిన్నారి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కథలో.. ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషించిన బేబీ మోనికా ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మందికి అనిపించే ఉంటుంది. పైగా ఈ ఖైదీ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఒకసారి బేబీ మోనికా ఎలా ఉందో తెలుసుకుంటే బాగానే ఉంటుంది. అముదా పాత్ర చేసిన బేబీ మోనికా చాలా పాపులర్. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఖైదీ మాత్రమే కాకుండా.. ఎరుంబు, ది ప్రీస్ట్, ఖాదర్ భాషా వంటి మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ది ప్రీస్ట్ మూవీకి మాలీవుడ్ ఫ్లిక్స్ నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇంకా కొన్ని రోజులు పోతే బేబీ మౌనికా శివని.. హీరోయిన్ మౌనికా అనే పరిస్థితి వచ్చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…