Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన బర్త్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. మోహన్ బాబుతో ఎవరికైన అభిప్రాయబేధాలు వస్తే కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం.. మనం చూస్తూనే ఉన్నాం.అయితే చిరంజీవితోను మోహన్ బాబుకి పలు సందర్భాలలో విబేధాలు వచ్చాయి. ఇక చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి తరచుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాకు చిరంజీవికి విభేదాలు ఉన్నాయని తరచుగా వార్తలు రాస్తుంటారు. మేము ఎన్నో సార్లు కలుస్తుంటాం.. మాట్లాడుకుంటాం. భార్య భర్తల్లాగా పోట్లాడుకుని మళ్ళీ కలసిపోతుంటాం అని సరదా వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా మంచు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు స్పష్టంగా బయట పడడం మనం చూశాం. అయితే చిరంజీవి మన మోహన్ బాబే కదా అని ఆయన మాటలను పాజిటివ్ గా తీసుకోవడం చేస్తుంటారు. టామ్ అండ్ జెర్రీలా ఉన్నా కూడా ఎప్పుడైనా సందర్భం వస్తే వీళ్ళు కలిసినంత ఆప్యాయంగా మరెవరూ ఉండరేమో అనేంత క్లోజ్ రిలేషన్ షిప్ కలిగి ఉంటారు.
మోహన్ బాబు, చిరంజీవి ఎన్నో చిత్రాల్లో కలసి నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇక మోహన్ బాబు ఇప్పటికీ పలు చిత్రాలు చేస్తుండగా, అవి మాత్రం పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని మోహన్ బాబే స్వయంగా ఒప్పుకోవడం విశేషం. ఇక తన పెద్ద కుమారుడు మంచు విష్ణు నటించిన జిన్నా చిత్రంపై మాట్లాడుతూ ఆ మూవీ మంచిగా ఉంటుంది. అయినప్పటికీ అది ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కావడం లేదు అని అన్నారు. తాను తరచుగా ఎమోషనల్ అవుతుంటానని కూడా మోహన్ బాబు అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…