Mohammad Shami : ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ పేసర్ షమీ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఆడిన ప్రతి మ్యాచ్‌లోను కీలక వికెట్లు తీసి భారత్‌కి అద్భుతమైన విజయాలు అందించాడు.ఇప్పుడు భారత జట్టులో సీనియర్ ఫేసర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ వయస్సు పెరుగుతున్న ఇక తన బౌలింగ్ మాత్రం రోజురోజుకీ మరింత పదునవుతుంది . జట్టు నుంచి పక్కన పెట్టాల్సిందే అనే చర్చ వచ్చిన ప్రతిసారి కూడా తన బౌలింగ్ తో అదరగొడుతూ ఏకంగా క్రికెట్ ప్రేక్షకులు అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు ఈ స్టార్ క్రికెటర్. ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో అతను బౌలింగ్ తో ఎంతటి అద్భుతం చేసి చూపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆరంభంలో షమీకి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కూడా రాలేదు. కాని టీమ్ కాంబినేషన్ కుదరకపోవడంతో షమీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ, ఒక్కసారి షమీ టీమ్‌లోకి వచ్చిన తర్వాత.. తన సత్తా ఏంటో చాటి చూపించి ఏకంగా ఐదు వికెట్ల హల్ సాధించాడు.. తాను బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పాడు. దీంతో అక్కడి నుంచి షమీని కదిపే సాహసం రోహిత్ చేయలేకపోయాడు.వరల్డ్ కప్ టోర్నీలో కేవలం 7 మ్యాచ్ లు మాత్రమే ఆడిన షమీ ఏకంగా 24 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. కానీ, వరల్డ్ కప్ తర్వాత మళ్లీ షమీ మ్యాచ్ ఆడలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. ఈ గాయాలు షమీని వరల్డ్ కప్ సమయంలోనే ఇబ్బంది పెట్టినట్లు తాజాగా జాతీయ మీడియా పేర్కొంటోంది.
ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ టీమిండియా ఆడుతున్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మాత్రమే కాదు వరల్డ్ కప్ సమయంలో కూడా ఇదే గాయంతో బాధపడ్డాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ సమయంలో షమీ ఏకంగా ఇంజక్షన్స్ సహాయంతో బరిలోకి దిగాడని.. ఇటీవల అతని సన్నిహితులు వెల్లడించారు. టోర్నీ మొత్తం గాయం నొప్పిని భరిస్తూనే ప్రతిరోజు ఇంజక్షన్స్ తీసుకుని షమీ బౌలింగ్ చేశాడట. షమీ పడిన కష్టానికి టీమిండియా వరల్డ్ కప్ గెలిచి ఉంటే బాగుండేదని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…