MM Keeravani : ఆస్కార్ అవార్డ్ విజేత కీరవాణి రీసెంట్‌గా నా సామిరంగ చిత్రంతో ప్రేక్షకులని అలరించాడు. నాగార్జున హీరోగా రూపొందిన నా సామిరంగ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. చిత్రానికి చంద్రబోస్ పాటలు రాశారు. ‘నా సామిరంగ’ సినిమా త్వరగా అయిపోవడానికి కీరవాణి కూడా ఒక కారణమని, తనే సినిమాకు స్టార్ అని నాగార్జున ఇప్పటికే ప్రశంసించారు. అయితే మూవీ రిలీజ్‌కు ముందు నాగార్జున, కీరవాణి, చంద్రబోస్ కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో తన మందు కహానీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కీరవాణి. ‘నేను చక్రవర్తిగారి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకంటే మనో, ప్రసన్న కుమార్ సీనియర్లు. నన్ను ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి పార్టీ ఇవ్వాలని అన్నారు. నేను అప్పటికీ మందు తాగలేదు. మందు పార్టీ కావాలంటే నా పేమెంట్‌తో పార్కింగ్‌లో, చీకటిలో వారికి పార్టీ ఏర్పాటు చేశాను. బ్రాందీ తెప్పించాను. నువ్వు కూడా తాగాలి అప్పుడే పార్టీ అన్నారు.
నేను స్పాన్సర్‌ను కదా అంటే లేదు తాగాలి అని బెదిరించారు. ఫస్ట్ సిప్ టేస్ట్ ఎలా ఉందంటే.. చనిపోయిన ఎలుకను గ్లాస్ నీళ్లలో వేసి ఒకరోజంతా నానబెడితే ఎలా ఉంటుందో.. అది బ్రాందీ టేస్ట్. ఎందుకు తాగుతున్నారు ఇది టేస్ట్ బాలేదు అన్నాను’’ అంటూ బ్రాందీ టేస్ట్ గురించి కీరవాణి వివరించగానే నాగార్జున, చంద్రబోస్ పడిపడి నవ్వుకున్నారు. చివరిసారిగా తన స్నేహితుడి పెళ్లిలో తాగానని, 1990 నుంచి మందుకు దూరంగా ఉంటున్నానని తెలిపారు కీరవాణి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని అనుకున్నారు ఈ సీనియర్ మ్యూజిషియన్. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వరకు వెయిట్ చేశారు.
చివరికి ఆ ‘ఆర్ఆర్ఆర్’ వల్లే తెలుగు సినిమాకు ఆస్కార్‌ను తీసుకురాగలిగారు. అంతే కాకుండా రిటైర్‌మెంట్ ఆలోచనను కూడా పక్కన పెట్టారు. నాగార్జున, కీరవాణి కాంబినేషన్‌లో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. తాజాగా విడుదలయిన ‘నా సామిరంగ’కు కూడా కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయ్యిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నా సామిరంగ చిత్రం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…