MLC Kavitha : ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ దారుణమైన ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కవిత అరెస్ట్ కూడా ఆ పార్టీని బాగా కుంగదీసేలా చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. కవితను అరెస్టు చేసి నేటికి 164 రోజులు కాగా.. జ్యుడిషీయల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే కవిత పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ గవాయ్, విశ్వానాథ్‌లతో కూడిన ధర్మాసనం ఆణెకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. సుమారు 2 గంటల పాటు ఇరువైపుల వాడీవేడీ వాదనలు జరగ్గా.. కవిత తరపు లాయర్ ముఖుల్ రోహత్గి వినిపించిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.
దీంతో.. మహిళగా బెయిల్‌కు కవిత అర్హురాలని ధర్మాసనం అభిప్రాయపడింది.. ఈడీ, సీబీఐ కేసులో కవితకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఒక్కో కేసుకు రూ.10 లక్షల చొప్పున రెండు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని, కవిత పాస్‌పోర్ట్‌ను కూడా అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఇన్నాళ్లు జైలులో ఉన్న కవిత ఇప్పుడు విడుదల కానుండడంతో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. జూలై 16న కవిత తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జడ్జి అనుమతితో జూలై 18న ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.
ఆగస్టు 22న కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో పాటు, గైనిక్ సమస్యలతో బాధపడటంతో ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అదే రోజు తిరిగి జైలుకు తరలించారు.ఇటీవల రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీలో కాస్త ఉత్సాహం నెలకొనగా, ఇప్పుడు కవిత జైలు నుండి విడుదల కానుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ పుంజుకోబోతున్నట్టు తెలుస్తుంది.